ఏపీలో తొలిసారి కియా కంపెనీకి సీఎం జగన్

ఏపీలో తొలిసారి కియా కంపెనీకి సీఎం జగన్

కియా మోటార్స్, సీఎం జగన్

ఎల్లుండి సీఎం జగన్ కియా మోటార్స్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు.

  • Share this:
    ఈ నెల 5వ తేదీ కియా మోటార్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చంద్రుడు సమీక్ష నిర్వహించారు. కియా కంపెనీ లీగల్ హెడ్ జుడ్, జిల్లా ఎస్పీ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యమ్రంలో భాగంగా ప్లాంట్ టూర్, ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. సీఎం జగన్ అనంతపురం రాక సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయం, కియా కంపెనీలో కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భద్రతా పరమైన అంశాలను ఎస్పీతో చర్చించారు.

    గతంలో కియా ప్లాంట్‌లో తయారైన కారు లాంఛింగ్ కార్యక్రమానికి సీఎం జగన్ దూరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మాజీ సీఎం చంద్రబాబుకు క్రెడిట్ దక్కుతుందనే కారణంగానే సీఎం జగన్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ కియా కంపెనీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: