Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN TO CONDUCT HIGH LEVEL REVIEW MEETING ON NEW DISTRICTS ISSUE FULL DETAILS HERE PRN

AP New Districts: కొత్త జిల్లాలపై సస్పెన్స్.. ఆ డిమాండ్లను సీఎం పరిష్కరిస్తారా.. నేడు కీలక సమావేశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉగాది (ఙోగ) నుంచి కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లాలపై కసరత్తు దాదాపు పూర్తైంది. ఉగాదికి ఇంకా రెండు రోజులే ఉండటంతో జిల్లాల ఏర్పాటులో తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉగాది (Ugadi) నుంచి కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లాలపై కసరత్తు దాదాపు పూర్తైంది. ఉగాదికి ఇంకా రెండు రోజులే ఉండటంతో జిల్లాల ఏర్పాటులో తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం జగన్ (CM YS Jagan) కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు. కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్లో ఏముంటబోతోంది..? ఎవరి డిమాండ్లను సీఎం పరిగణలోకి తీసుకోబోతున్నారు..? అనే అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బుధవారం జరిగే సమావేశంలో గతంలో ఇచ్చిన జిల్లాల నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులు, జిల్లా పేర్లు, కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లపై పూర్తి స్పష్టత రానుంది.

    జిల్లాల పేర్లు, పరిధుల కంటే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా వచ్చిన డిమాండ్లు, విజ్ఞప్తుల ఆధారంగా రెవెన్యూ డివిజన్లపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఐతే మండలాలు, గ్రామాలను వేరే జిల్లాల్లోకి మార్చే అంశంపై నే సందిగ్ధన నెలకొంది. ఈ డిమాండ్లపై అధికారులు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వీటిపై ముఖ్యమంత్రే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐతే ఏది ఏమైనా అనుకున్న సమయానికి కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు పండగ కంటే ముందే తుదినోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

    ఇది చదవండి: ఆ విషయంలో తగ్గేదేలే.. అధికారులకు సీఎం జగన్ టార్గెట్..



    మరోవైపు ఇప్పటికే తాము చేసిన ప్రతిపాదనలు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి చెప్పారు. అంతేకాదు ఉయ్యూరులో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు భవనాన్ని కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారాయన. ఈ డివిజన్లో పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలు రానున్నాయని పార్థసారధి తెలిపారు.

    ఇది చదవండి: టీడీపీ లెక్క 23 నుంచి 123 అవ్వాలంటే ఏం చేయాలి.. ఇప్పుడేం చేస్తోంది..?


    ఇదిలా ఉంటే డిమాండ్లు, విజ్ఞప్తులు, మార్పులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు దాదాపు పూర్తైంది. ముఖ్యంగా ఉగాది నుంచి పాలన ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల కోసం ఇప్పటికే భవనాల ఎంపిక పూర్తైంది. ఎంపిక చేసిన భవనాల్లో వసతులకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.

    ఇది చదవండి: ఏపీలోని ఆ పథకంపై ఆసక్తి చూపని జనం.. ఏడాదికి రూ.60వేలు ఇస్తామన్నా నో రెస్పాన్స్..!


    విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కోసం ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. అలాగే బాపట్ల కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా కోసం భవనాలు సిద్ధమయ్యాయి. బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో కార్యలయాల కోసం ఏర్పాట్లు చేసత్న్నారు. అలాగే ఇతర జిల్లా కార్యాలయాల కోసం మరికొన్ని భవనాలను ఎంపిక చేశారు. ఇక విశాఖ జిల్లా పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యాలయం కోసం ఐటీడీఏ కార్యాలయాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అలాగే పార్వతీపురం కేంద్రంగా ఏర్పడే మన్యం జిల్లా కలెక్టరేట్ గా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం సేవలందించనుంది. ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

    ఇది చదవండి: మంత్రి పదవే నాకు అడ్డు.. లేదంటే టీడీపీకి విశ్వరూపమే! కొడాలి నాని.. భీమ్లా నాయక్ డైలాగ్..


    తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీబాలాజీ జిల్లా కలెక్టరేట్ గా పద్మావతి నిలయాన్ని సిద్ధం చేస్తుండగా ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉంటే అనకాపల్లి, రాజమహేంద్రవరం, భీమవరం, పల్నాడు, నంద్యాల,శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లా కేంద్రాల కోసం ఏర్పాట్లు పూర్తికావొచ్చినట్లు అధికారులు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP new districts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు