గుడ్‌న్యూస్..మెడికల్ బిల్లు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

ఆరోగ్యశ్రీలో ఇప్పుడు వ్యాధులను రెట్టింపు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై 2వేలకు పైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించనున్నారు.

news18-telugu
Updated: August 13, 2019, 10:32 PM IST
గుడ్‌న్యూస్..మెడికల్ బిల్లు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
నమూనా చిత్రం
  • Share this:
ఏపీలోని సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన సేవలు అందించేలా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఆరోగ్యశ్రీలో ఇప్పుడున్న వ్యాధులను రెట్టింపు చేయనుంది. మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించేందుకు..ప్రతి కుటుంబానికి క్యూర్ కోడ్‌తో కూడిన హెల్త్ కార్డ్ ఇవ్వనుంది. డిసెంబర్ 21 నుంచి హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు కోటి మందికి లబ్ధి చేకూరుతుంది.

అంతేకాదు ఆస్పత్రి బిల్లు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. 3 నెలల పాటు పథకం అమలును అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రమంతటా అమలు చేస్తారు.

ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులను, 108 & 104 సర్వీసులను మెరుగుపరుస్తున్నాం. మరో వెయ్యి వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. 104, 108 వాహనాలు ఎప్పుడూ కండిషన్‌లో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
వైఎస్ జగన్


ఆరోగ్యశ్రీలో ఇప్పుడు వ్యాధులను రెట్టింపు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై 2వేలకు పైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించనున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని 150 ఆస్పత్రుల్లో నవంబరు నుంచి ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో వైద్యసదుపాయాలపై థర్డ్ పార్టీ ద్వారా తనిఖీలు నిర్వహిస్తారు. లోపాలున్న ఆస్పత్రులకు కొంతకాలంగా గడువు ఇచ్చి మరోసారి తనిఖీలు చేస్తారు. అప్పుడు కూడా లోపాలంటే నెట్‌వర్క్ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగిస్తారు.
First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు