విశాఖపై జగన్ నజర్... మెట్రోపై స్పెషల్ ఫోకస్

విశాఖ అభివృద్ధిపై ఏపీ సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

news18-telugu
Updated: December 3, 2019, 3:01 PM IST
విశాఖపై జగన్ నజర్... మెట్రోపై స్పెషల్ ఫోకస్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో రవాణా, తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై ఆయన అధికారులతో చర్చించారు. పోలవరం నుంచి నేరుగా పైపులైన్‌ ద్వారా విశాఖపట్నంకు నిరంతర నీటి సరఫరాపై సమావేశంలో చర్చించారు. పోలవరం వద్దే నీటిని ఫిల్టర్‌ చేసి అక్కడనుంచి విశాఖకు పంపిణీ చేయాలని సూచించారు. విశాఖ భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా తాగునీటి సరఫరా ఉండాలని అన్నారు. పరిశ్రమల అవసరాల కోసం డీశాలినేషన్‌ వాటర్‌ ప్లాంట్లు ఉపయోగించాలని సూచించారు.

పరిశ్రమలకు ప్రెష్‌వాటర్‌ కాకుండా డీశాలినేషన్‌ నీటిని వాడే ఆలోచన చేయాలని అన్నారు. విశాఖపట్నంలో రోడ్లు అన్నింటినీ బాగు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. నిర్మాణశైలిలో మార్పులు సూచించారు. సమావేశంలో కైలాసగిరిలో ప్లానెటోరియంపైన వివరాలను అధికారులు జగన్‌కు అందించారు. ఇక విశాఖపట్నం మెట్రోరైల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలపై సీఎం జగన్‌కు వివరాలు అందించారు.

Ap cm ys jagan, ap latest news, Visakhapatnam, visakha metro rail, ఏపీ సీఎం జగన్, ఏపీ లేటెస్ట్ న్యూస్, విశాఖపట్నం, విశాఖ మెట్రో రైల్
విశాఖపట్టణం


10 విడతలు, 10 కారిడార్లు ఉండేలా మెట్రో రైలు ప్లాన్ చేశారు. మెట్రోరైల్‌ మొత్తం మార్గం 140.13 కి.మీ, ఫస్ట్‌ ఫేజ్‌ మొత్తం 46.40 కి.మీ, స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది 34.23 కి.మీ, గురుద్వార – ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ 5.26 కి.మీ, తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్‌ 6.91 కిలోమీటర్లుగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2020–2024 మధ్య విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌.పి.రామకృష్ణారెడ్డి, విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌ సృజన, వీఎంఆర్‌డీఏ వైస్‌ ఛైర్మన్‌ కోటేశ్వర్రావు పాల్గొన్నారు.


First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>