హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: శ్రీకాకుళం ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం..

YS Jagan: శ్రీకాకుళం ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

శ్రీకాకుళం (Srikakulam) రైలు ప్రమాదం (Train accident) పై సీఎం జగన్ (CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

  శ్రీకాకుళం (Srikakulam) రైలు ప్రమాదం (Train accident) పై సీఎం జగన్ (CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లాకలెక్టర్‌ నివేదించిన తాజా వివరాలను సీఎంఓ కార్యదర్శి ముఖ్యమంత్రికి అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిలో గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు.

  అలాగే ఈ ఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని, గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్‌ స్వయంగా రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారని, మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. మరణించిన వారు పరాయి రాష్ట్రం వారైనా, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని, ఈసహాయం వెంటనే అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

  ఇది చదవండి: రైతుకు భరోసా.. జగన్ సర్కార్ కు సవాల్.. మరో యాత్రకు పవన్ శ్రీకారం..


  కాగా సోమవారం సికింద్రాబాద్ (Secundrabad) నుంచి గౌహతి వైపు వెళ్తున్న రైలు శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం-బాతువ ప్రాంతానికి వచ్చేసరికి రైలులోని బ్రేక్ బైండింగ్ జరిగింది. ఆ సమస్యను గుర్తించి.. రైలు కాసేపు ట్రాక్ పై ఆపిన సిబ్బంది ఆ సమాచారాన్ని రైల్వే ఉన్నతాధికారులకు అందించారు. కాసేపు ట్రైన్ ట్రాక్ పైనే ఆగి ఉండడంతో.. అదే సమయంలో సాధారణ బోగీలో ఉన్న ప్రయాణికులు కొంతమంది గాలి కోసం బయటకు దిగారు. అలా గాలి కోసం దిగడమే వారి పాపం అయ్యింది.. ఏం కాదులే అని ట్రైన్ దిగి ట్రాప్ పై నిలబ్బ నిర్లక్ష్యం వారిని బలి తీసుకునేలా చేసింది. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబయి వైపు వెళ్తున్న కోణార్క్ రైలు అతి వేగంగా వచ్చి అక్కడ ఉన్నవారిని ఢీ కొంది. ట్రైన్ వస్తోంది అనే గుర్తించే లోపే వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరి కొంతమందికి గాయాలయ్యాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Srikakulam, Train accident

  ఉత్తమ కథలు