పదో తరగతి పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. టెన్త్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులను తొలగించారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రశ్నాపత్రంలోనే బిట్ పేపర్ ఉంటుందని ఆయన తెలిపారు. పశ్రాపత్రంలో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులను కేటాయిస్తామని చెప్పారు ఏపీ విద్యాశాఖ మంత్రి.
ప్రస్తుతం పదో తరగతి పరీక్ష సమయం రెండున్నర గంటలుగా ఉంది. ఆ సమయాన్ని మరో 15 నిమిషాలు పొడిగించామని మంత్రి వెల్లడించారు. పశ్రాపత్రాన్ని చదువుకునేందుకు ఈ అదనపు సమయం ఉపయోగపడుతుందని తెలిపారు సురేష్. ఆన్సర్ షీట్‌ను కూడా నాణ్యంగా తయారు చేస్తామని.. పదో తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ సంస్కరణలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.