ఏపీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు... బీటెక్‌లోనూ మార్పులు

మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ల చేసి... ఒక సంవత్సరం జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు.

news18-telugu
Updated: December 13, 2019, 7:13 PM IST
ఏపీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు... బీటెక్‌లోనూ మార్పులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యార్థులు చదువుకునే కోర్సులు ఉద్యోగాలు తెచ్చిపెట్టే విధంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందుకే ఏపీలోని విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లు చేసి... ఒక సంవత్సరం జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. బీటెక్ కోర్సును కూడా ఐదేళ్లు చేసిన ఇదే రకమైన విధానాన్ని అమలు చేయాలని అనుకుంటున్నామని వివరించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న సీఎం జగన్... ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మేలు చేస్తాయని అన్నారు.

Cm ys jagan, Andhra university, degree, btech, Visakhapatnam, సీఎం జగన్, ఆంధ్రా యూనివర్సిటీ, బీటెక్, డిగ్రీ, విశాఖ
కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్


కాలేజీ, యూనివర్సిటీల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు... తాము చదువుకున్న విద్యాసంస్థలకు ఎంతో కొంత మేలు చేయాలని సీఎం జగన్ సూచించారు. స్కాలర్ షిప్స్ విషయంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోందని... విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును తాము భరించే విధంగా పూర్తిస్థాయిలో స్కాలర్ షిప్స్ ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి సీఎం జగన్‌ నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహేంద్ర సంస్థ సీఈవో సీపీ గుర్నానీ, గ్రంథి మల్లిఖార్జునరావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, శిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీఎంఆర్‌ అధినేత, అలుమ్ని వ్యవస్థాపక చైర్మన్‌ జీఎం రావు, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి, మాజీ డీజీపీ, గంగవరం పోర్ట్‌ సీఈవో సాంబశివరావు, మాజీ వీసీ ప్రొఫెసర్‌ బీల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>