పేదలకు మరో శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్

వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఏపీ సీఎం. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులుకు సూచించారు.

news18-telugu
Updated: June 2, 2020, 7:27 PM IST
పేదలకు మరో శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan)
  • Share this:
పేదలకు ఏపీ సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్లబకాయిలను చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌సహా అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు సీఎం జగన్. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈచెల్లింపులు చేయాలని.. నిధులు సమీకరించుకుని చెల్లింపుల తేదీ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగితెలుసుకున్నారు సీఎం. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు సీఎం జగన్.

పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలి. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలి. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలి, గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలి. పేదలకోసం చేస్తున్న ఈకార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే పుణ్యం దక్కుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నాం.
వైఎస్ జగన్, ఏపీ సీఎం


వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఏపీ సీఎం. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులుకు సూచించారు. వారి కేటాయించిన స్థలంవద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

First published: June 2, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading