హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Ugadi Celebrations: ఉగాది వేడుకల్లో సీఎం జగన్.. ఈ ఏడాది ఎలా ఉండబోతోందంటే..!

CM Jagan Ugadi Celebrations: ఉగాది వేడుకల్లో సీఎం జగన్.. ఈ ఏడాది ఎలా ఉండబోతోందంటే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) లో ఉగాది వేడుకలు (Ugadi Festival) ఘనంగా జరుగుతున్నాయి. తెలుగువారంతా శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాదికి ప్రత్యేక పూజలతో స్వాగతం పలుకుతున్నారు. సీఎం జగన్ దంపతులు కూడా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) లో ఉగాది వేడుకలు (Ugadi Festival) ఘనంగా జరుగుతున్నాయి. తెలుగువారంతా శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాదికి ప్రత్యేక పూజలతో స్వాగతం పలుకుతున్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలంతా ఉగాది పచ్చడి ఆరగిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. ఇక తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. ఆ తర్వాత వేదపాఠశాల విద్యార్థులతో కలిసి వేడుకలకు వచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

  రాష్ట్ర దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి అన కప్పగంతు సుబ్బరామ సోమయాజీ ఈ కార్యక్రమంలో పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా పేరుకు తగ్గట్లే శుభకృత్ నామ సంత్సరం అందరికీ శుభాలు చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. చల్లనిపాలకు తగ్గట్లే ప్రజలంతా సంతోషంగా ఉంటారని మంచి పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశముందని తెలిపారు. ఓర్పుగా అన్ని అవాంతరాలన ఎదుర్కొంటూ ముందుకెళ్తే విజయం సిద్ధిస్తుందన్నారు. తర్వాత వేదపండితులు సీఎం దంపతులకు ఉగాది పచ్చడిని అందజేసి ఆశీర్వదించారు.

  ఇది చదవండి: అమరావతికి 2024 వరకు టైమ్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్..

  అనంతరం పంచాంగకర్తను సీఎం జగన్ సన్మించారు. శారదాపీఠం తరపున సీఎం జగన్‌కు పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత మంచి చేసే పరిస్థితులు రావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

  ఇది చదవండి: కాబోయే ప్రధాని వైఎస్ జగన్.. ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..

  వైసీపీ కార్యాలయంలోనూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెట్టి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. వేడుకల్లో వైసీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  ఇది చదవండి: ఎలక్షన్స్ కోసం రూట్ మ్యాప్ ఫిక్స్ చేసిన జగన్.., మంత్రులతో సజ్జల కీలక భేటీ..

  అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ugadi 2022

  ఉత్తమ కథలు