రాజీనామా చేయండి.. పృథ్వీరాజ్‌కు సీఎం జగన్ అల్టిమేటం

రాజీనామా చేయండి.. పృథ్వీరాజ్‌కు సీఎం జగన్ అల్టిమేటం

కమెడియన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వీ

సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్‌ను టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు.

 • Last Updated:
 • Share this:
  పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్‌ను టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు.

  ఇక ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు వైవీ సుబ్బారెడ్డి. ఆడియోలోని వాయిస్ శాంపిల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయిలో విచారణకు చర్యలు చేపట్టారు. ఐతే తనపై ఆరోపణలను పృథ్వీ రాజ్ ఖండించారు. తనపై బురద చల్లేందుకు ఎవరో పనిగట్టుకొని తన స్వరాన్ని అనుకరించి ఆడియో రూపొందించారని టిటిడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి నివేదించారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు చెప్పారు సుబ్బారెడ్డి.

  ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించాలని శ్రీవారి భక్తులు, నెటిజన్లు, మహిళా సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు