సీఎంఆర్ఎఫ్‌కు నకిలీ చెక్కులు, విచారణకు సీఎం జగన్ ఆదేశం

ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి నకిలీ చెక్కుల వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: September 20, 2020, 9:43 PM IST
సీఎంఆర్ఎఫ్‌కు నకిలీ చెక్కులు, విచారణకు సీఎం జగన్ ఆదేశం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి నకిలీ చెక్కుల వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కర్నాటక, ఢిల్లీ, కోల్‌కతాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మంగళూరు మూడ్‌బద్రి శాఖలో రూ.52.65 కోట్లు, ఢిల్లీలోని సిసిపిసిఐకి రూ.39.85 కోట్లు, కోల్‌కతా సర్కిల్‌లోని మెగ్‌రాహత్‌శాఖలో రూ.24.65 కోట్ల విలువైన చెక్కులను వేశారు. క్లియరెన్స్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని వెలగపూడి శాఖకు అక్కడి శాఖ అధికారులు ఫోన్‌ చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 9:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading