హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: విద్యార్థులకు శుభవార్త.. రేపే వారి ఖాతాల్లోకి డబ్బులు

YS Jagan: విద్యార్థులకు శుభవార్త.. రేపే వారి ఖాతాల్లోకి డబ్బులు

ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జగన్ నగదు జమ చేస్తారు. మరోవైపు.. వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపింది.

ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జగన్ నగదు జమ చేస్తారు. మరోవైపు.. వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపింది.

Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్ధులందరికీ ఏపీ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తోంది.

  ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద రేపు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఏపీ సర్కార్ నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. అక్టోబర్‌-డిసెంబర్ 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లు అందించనుంది. రేపు సీఎం జగన్‌(Ap cm ys jagan mohan reddy) బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు.

  జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena) పథకం కింద అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా నగదు అందజేస్తోంది. త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 9 వేల కోట్లకు పైగా నగదు బదిలీ చేసింది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులకు(Students) విద్యాదీవెన ద్వారా లబ్ధి చేకూరుతుంది.

  గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 8న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి విద్యాదీవెన జమ కావాల్సి ఉంది. అయితే మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం కావడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. దీంతో విద్యాదివెన నగదు జమ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. రేపు ఈ సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమచేయనున్నారు.

  YCP Target 2024: మరోసారి ఆయన్నే నమ్ముకున్న అధినేత.. 2024లో విజయం కోసం కీలక బాధ్యతలు

  Jagan On MLAs: ఇలా అయితే కష్టమే.. ఇంటింటికీ వెళ్లండి.. ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్..? జగన్ లెక్క ఇదే.. కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే?

  ఆంధ్ర్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దని జగన్ సర్కార్ నిర్ణయించింది. అందుకే పథకాలను అమలు చేయడంలో ప్రత్యేకమైన శ్రద్థ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా జగనన్న విద్యాదీవెన పథకం అమలు కోసం రూ. 709 కోట్లు కేటాయించింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు