హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan | Amit Shah: నేడు హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ కీలక భేటీ..

YS Jagan | Amit Shah: నేడు హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ కీలక భేటీ..

అమిత్ షా, వైఎస్ జగన్

అమిత్ షా, వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy: బుధవారం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా సీఎం జగన్ కలిశారు.  దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు.  రాష్ట్ర విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని, ప్ర‌త్యేక హోదాతో పాటు, ప‌లు పెండింగ్ అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని కలిసిన సీఎం జగన్.. నేడు హోమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah)తో సమావేశం కానున్నారు. వాస్తవానికి బుధవారం రాత్రి 10 గంటలకే అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారి సమావేశం ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 10:30 గంటలకు అమిత్ షాను కలవనున్నారు సీఎం జగన్. ఈ భేటీలో విభజన హామీల అమలు, ఏపీ అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు ఏపీలో తాజా రాజకీయాల గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Kurnool: సొంత నియోజకవర్గంలో మంత్రికి చుక్కలు.. అసమ్మతికి కారణం ఇదే

కాగా,  బుధవారం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా సీఎం జగన్ కలిశారు.  దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు.  రాష్ట్ర విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని, ప్ర‌త్యేక హోదాతో పాటు, ప‌లు పెండింగ్ అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినా..విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఇప్పటికే చాలా వాటిని నెరవేర్చలేదని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల నిధులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కం  నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు.

Nara Lokesh: 400 రోజులు.. 4000 కిలోమీటర్లు.. 27 నుంచి లోకేష్ పాదయాత్ర.. యువ ఓటర్లే లక్ష్యంగా పేరు

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి పెరిగిందని.. ఆ జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం జగన్.  విశాఖపట్టణంలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌కు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించామని..  ఆ ప్రాజెక్టుకు అవసరమైన సహాయ సహకరాలను అందించాలని కేంద్రాన్ని కోరారు సీఎం జగన్. తన విజ్ఞప్తులపై ప్ర‌ధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఐతే వీరి భేటీలో కేవలం  రాష్ట్రాభివృద్ధి గురించే చర్చ జరిగిందా? లేదంటే రాజకీయాలు కూడా చర్చించారా? అనేది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Amit Shah, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Narendra modi, Ysrcp

ఉత్తమ కథలు