ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లులేని పేదవారికి జగనన్న కాలనీల పేరిట ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అందులో ఇళ్లు కూడా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఇళ్లులేని మధ్యతరగతి ప్రజలకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ (Jagananna Smart Townships) తక్కువ ధరకే ఇంటి స్థలాలను అదించే కార్యక్రమానికి సీఎం జగన్ (AP CM YS Jagan) శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశలో అనంతపురము జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఔట్లలో మంగళవారం నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు పథకానికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు.
రూ. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్ధలాలను కేటాయిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేటుతో కేటాయిస్తారు. అన్ని పట్టణాభివృద్ది సంస్ధల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగ నియమాల మేరకు ఏడాదిలోగా లేఔట్లను ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది.
చెల్లింపు ఇలా..
ఈ పథకం కింద ఒక సంవత్సర వ్యవధిలో 4 వాయిదాలలో నగదు చెల్లించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్ చేసిన ప్లాట్ లబ్ధిదారునికి స్వాధీనం, దరఖాస్తుతో పాటు ప్లాటు విలువలో 10 శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేది లోపు ఏది ముందయితే అప్పటికి మిగిలిన 30 శాతం చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5 శాతం మేరకు రాయితీ ఇస్తారు. https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు.
లేఔట్ల ప్రత్యేకతలు
విద్యుదీకరణ మరియు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలు
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.