ఏపీలో చరిత్రాత్మక పథకానికి రేపే సీఎం జగన్ శ్రీకారం...

జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఈ నెల 9న (రేపు) చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

news18-telugu
Updated: January 8, 2020, 4:44 PM IST
ఏపీలో చరిత్రాత్మక పథకానికి రేపే సీఎం జగన్ శ్రీకారం...
దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఎప్పుడు విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతారనే అంశం ఆసక్తికరంగా మారింది.
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఈ నెల 9న (రేపు) చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్‌ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్‌ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో వైఎస్‌ జగన్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం బడ్జెట్లలో ఈ పథకానికి ఏకంగా రూ.6,500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.  ప్రతి ఏటా జనవరిలో నేరుగా  బ్యాంక్‌ అకౌంట్లలో జమచేయనున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 8, 2020, 4:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading