పోలవరంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు

గతేడాది వరదలకు కాపర్ డ్యామ్ కారణంగా ఈ గ్రామాలు నీటమునిగాయి. దీంతో బాధిత గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

  • Share this:
    పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ముంపు ప్రజల తరలింపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలవరం ముంపు గ్రామాల పరిధిలో ఉన్న దేవీపట్నంలో ఆరు గ్రామాలకు ఆర్అండ్ఆర్ కింద రూ. 79 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది వరదలకు కాపర్ డ్యామ్ కారణంగా ఈ గ్రామాలు నీటమునిగాయి. దీంతో బాధిత గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

    బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులకు నెల రోజులకుపైగా అంతరాయం కలిగిందని.. ప్రధానంగా సిమెంట్, స్టీల్‌ సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. గత నెల 20 నుంచి పనుల పరిస్థితి మెరుగు పడిందన్నారు. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సిమెంట్, స్టీలు సరఫరా మొదలవు తోందని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వాటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదావరికి వరదలు వచ్చేలోగా పోలవరం స్పిల్‌ వే పనులను జూన్‌ ఆఖరుకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: