AP CM YS JAGAN MOHAN REDDY RELEASED FUNDS TO WHO MISSED TO GET BENEFITS OF WELFARE SCHEMES FULL DETAILS HERE PRN
AP Welfare Schemes: వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. రూ.703 కోట్ల నగదు జమ..
వైఎస్ జగన్ (ఫైల్)
వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించి నగదు రానివారికి మరోసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నగదు జమ చేసింది. 12 పథకాలకు (AP Welfare Schemes) సంబంధించి 9.30 లక్షల మంది ఖాతాల్లో రూ.703 కోట్ల చొప్పున ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది.
వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించి నగదు రానివారికి మరోసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నగదు జమ చేసింది. 12 పథకాలకు (AP Welfare Schemes) సంబంధించి 9.30 లక్షల మంది ఖాతాల్లో రూ.703 కోట్ల చొప్పున ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది. ప్రతి ఏడాది జూన్ మరియు డిసెంబర్ మాసాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ (AP CM YS Jagan) కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన వారికి న్యాయం చేసేందుకే మరోసారి నగదు జమ చేస్తున్నామని జగన్ అన్నారు. ఇప్పటికీ పథకాలు అందనివారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పేదలపై మమకారంతోనే ఇలా చేస్తున్నామని సీఎం వివరించారు. గతంలో ప్రజలు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు.
టీడీపీ హయాంలో పెన్షన్లకు నెలకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే.. తాము రూ.1450 కోట్లు ఖర్చు చేస్తున్నామని అప్పట్లో రూ.వెయ్యి పెన్షన్ ఇస్తే తాము రూ.2,500కు పెంచినట్లు జగన్ తెలిపారు. అలాగే గతంలో 39 లక్షలు ఉన్న పెన్షన్లు ఇప్పుడు 61 లక్షలకు చేరాయన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందాలనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు.
వివిధ పథకాలకు సంబంధించి 9,30,809 మందికి రూ.703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి వివిధ పథకాల కింద జమ చేసిన ప్రభుత్వం.. వీటితో పాటు 3,44,497 మందికి పెన్షన్ కార్డులు, 3,07,599 మందికి బియ్యంకార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు లబ్ధిదారులు కలుపుకుని మొత్తంగా 18,48,596 మంది లబ్ధిదారులకు ప్రయోజనాలు అందించారు.
పథకాల వారీగా చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కింద 2.86 లక్షల మందికి రూ.58 కోట్లు, జగనన్న వసతిదీవెన (Jagananna Vasathi Deevena) కింద 43వేల మందికి 39.82 కోట్లు, జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena) కింద 31,940 మందికి రూ.19.92 కోట్లు, వైఎస్ ఆర్ కాపునేస్తం (YSR Kapu Nestham) కింద 12,983 మందికి రూ.19 కోట్లు, వైఎస్ఆర్ చేయూత (YSR Cheyutha) కింద 2.50 లక్షల మందికి రూ.470 కోట్లు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 59వేల మందికి కింద రూ.53 కోట్లు జమ చేశారు. అలాగే 1.10 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 1.51 లక్షల మందికి పెన్షన్ కార్డులను సీఎం వర్చువల్ పద్దతిలో మంజూరు చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.