Andhra Pradesh: అధికారులు, సిబ్బందిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. మెమోలు జారీ చేయాలని ఆదేశం

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: గత వారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం జగన్ ఆదేశించారు.

  • Share this:
    ఏపీలోని ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదనే విషయం తన దృష్టికి రావడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారికి మెమోలు జారీ చేయాలని అన్నారు. అంతేకాదు వారికి మెమోలు ఇవ్వడం అనేది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఒకరకంగా ఇది తన పనితీరుకు తాను మెమో ఇచ్చుకున్నట్టు అని సీఎం జగన్ అన్నారు. స్పందన కార్యక్రమం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఈ రకంగా కామెంట్ చేశారు.

    గత వారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అప్పటి ఆదేశాలకు అనుగుణంగా ఎంతమంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించారని ఆరా తీశారు. కొందరు జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదనే విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది.

    వీరితో పాటు పలువురు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సిబ్బంది హాజరుకావడం లేదని తెలియడంపై ఏపీ ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. వచ్చే స్పందన కార్యక్రమం నాటికి అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి తమ పొరపాటును సరిదిద్దుకోవాలని వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: