• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • AP CM YS JAGAN MOHAN REDDY MEETS UNION HOME MINISTER AMIT SHAH IN DELHI DISCUSSED MANY ISSUES AK

Andhra Pradesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సుదీర్ఘ భేటీ.. 10 అంశాలపై చర్చ

Andhra Pradesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సుదీర్ఘ భేటీ.. 10 అంశాలపై చర్చ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

Andhra Pradesh: ఈ భేటీలో ఏపీకి సంబంధించిన అనేక కీలకమైన అంశాలను సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం, ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి 10.30 గంటలకు ఈ భేటీ సాగింది. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన అనేక కీలకమైన అంశాలను సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం, ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అంచనాలను ఆమోదించాలని.. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని ఆయన కోరారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వుం కట్టుబడి ఉందని సీఎం జగన్ ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి తెలిపారు.

    కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సహకరించాలని.. ఇందుకోసం రీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన కోరారు. ఈ అంశానికి బీజేపీ మద్దతు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు పెద్ద సంఖ్యలో ఇల్లు కట్టించే అంశాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్.. ఇందుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. వీటితో సహా 10 అంశాలపై అమిత్ షా‌తో సీఎం జగన్ చర్చించారు. అంతకుముందు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్‌తో పాటు గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు