news18-telugu
Updated: August 26, 2019, 9:13 PM IST
అమిత్ షాతో జగన్ భేటీ
ఢిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సీఎం జగన్.. ఆ తర్వాత అమిత్ సాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం. పోలవరం ప్రాజెక్టుతో పాటు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు నిధులను ఇవ్వాలని కోరారు. చంద్రబాబు హయాంలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని..ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు.

అమిత్ షాతో జగన్ భేటీ
అంతకుముందు జరిగిన నక్సలిజంపై కేంద్రహోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రానికి పలు సూచనలు చేశారు జగన్. ప్రతి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ITDA)లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ మెడికల్ కాలేజీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు జగన్. సాలూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నక్సలిజంపై కేంద్రహోంశాఖ ఏర్పాటుచేసిన సమావేశంలో జగన్
Published by:
Shiva Kumar Addula
First published:
August 26, 2019, 9:08 PM IST