ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సంభవించిన వరద నష్టంపై (AP Floods) అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Mohan Reddy) భేటీ అయింది. ఈ సందర్భంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. అలాగే వరదను ఎదుర్కోవడంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. మీ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయమని.., అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారని.., విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని అభిప్రాయపడింది. కేంద్రం తరపున ఎన్ఎండీఎస్ సలహాదారు కునాల్ సత్యార్థి వివరాలను అందజేశారు. తమ పర్యటనలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని.. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.
వరదల్లో భవనాలు, ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నామని.. పశువులు కూడా భారీగా చనిపోయినట్లు కేంద్ర బృందంలోని అధికారులు వెల్లడించారు. భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు వచ్చే వరదను అడ్డుకునే రిజర్వాయర్లుగానీ, ప్రాజెక్టులుగానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో లేవని కేంద్ర బృందం అభిప్రాయపడింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా వరద ప్రభావం అధికంగా ఉందని అన్నారు. వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో. ఇగిగేషన్ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగిందని కేంద్ర బృందం అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాలను వీలైనంత మేర ఆదుకోవడానికి మావంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.
నష్టం అంచనాలకోసం ఆయా ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరుతున్నామని.. మేం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదన్నారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థఉందన్న సీఎం.. ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్ అయ్యిందిని.., సోషల్‌ఆడిట్‌కూడా చేయించామని వెల్లడించారు. నష్టంపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయని.., క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను కేంద్రానికి అందిచినట్లు తెలిపారు.
కోవిడ్ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్ నిధులు నిండుకున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించినట్లు సీఎం గుర్తుచేశారు. పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరారు. . కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామన్న సీఎం జగన్.. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది చదవండి: భార్యను భర్త కొట్టడం కరెక్టేనా..? తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఏమంటున్నారంటే..!
వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నన్నట్లు సీఎం జగన్ తెలిపారు. వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతామని.., ఆటోమేటిక్ వాగర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.