AP CM YS JAGAN MOHAN REDDY MADE KEY COMMENTS ON AIDED SCHOOLS ISSUE AS HE REVIEWED ON EDUCATION SYSTEM FULL DETAILS HERE PRN GNT
YS Jagan on Education: ఎయిడెడ్ స్కూళ్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... బలవంతం లేదని క్లారిటీ
వైఎస్ జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన విద్యావిధానం, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, జగనన్న గోరుముద్ద పథకాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన విద్యావిధానం, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, జగనన్న గోరుముద్ద పథకాలపై చర్చించారు. శాటిలైట్‌ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ ప్లస్‌స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ స్కూల్స్‌పై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. నూతన విద్యా విధానంలో తీసుకున్న చర్యలు వాటి అమలుపై సీఎం అధికారులను ఆరా తీశారు. 2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడుదశల్లో నూతన విద్యా విధానం అమలుకానుందని.., తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2663 స్కూళ్లు విలీనం చేశామని.., 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని.., మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చిందన్న అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ అదికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని.., దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సీఎం ఆదేశించారు. సీబీఎస్ఈ అఫిలియేషన్‌మీద కూడా సమావేశంలో సీఎం సమీక్ష జరిపారు. 1092 స్కూల్స్ 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అఫిలియేషన్ జరిగాయని అధికారులు వివరించారు. ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఇవ్వడం రికార్డని అధికారులు తెలిపారు.
స్కూళ్లలో సమస్యలపై కాల్ సెంటర్
పాఠశాలల్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్చేసేలా ఒక నంబర్ పెట్టాలని..., ప్రతి స్కూల్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలని సీఎం సూచించారు. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ భాష, గ్రామర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. పిల్లలకు ఇచ్చిన డిక్షనరీలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించి వాటిని వినియోగించడం కూడా నేర్పాలన్నారు.
ఎయిడెడ్ స్కూళ్లపై కీలక వ్యాఖ్యలు
ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వంలో విలీనం చేయడంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్ పాఠశాలలు అప్పగించడం అనేది పూర్తిగా స్వచ్ఛందమని మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని చెప్పారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనంచేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. విలీనంచేస్తే.. వారి పేర్లు కొనసాగిస్తామని... ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు... నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే.. నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చన్నారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశమని... ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతంలేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలుకూడా తగవని స్పష్టం చేశారు.
గోరుముద్దపై ప్రత్యేక దృష్టి
ఇక జగనన్న గోరుముద్ద కార్యక్రమంపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. పాఠశాలల్లో లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలన్న సీఎం.., ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలని ఆదేశించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.