Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN MOHAN REDDY MADE KEY ANNOUNCEMENT ABOUT EMPLOYEES SALARIES AND OTHER BENEFITS FULL DETAILS HERE PRN GNT

Jagan on PRC: పీఆర్సీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఇకపై కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం..

వైఎస్ జగన్

వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు 23.29 శాతం పీఆర్సీ ఇస్తున్నట్లు సీఎం జగన్ (CM YS Jagan) తెలిపారు. పీఆర్సీతో పాటు పలు కీలక అంశాలను జగన్ ప్రకటించారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ (AP Government Emplyees PRC) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు 23.29 శాతం పీఆర్సీ ఇస్తున్నట్లు సీఎం జగన్ (CM YS Jagan) తెలిపారు. దీంతో రాష్ట్రప్రభుత్వంపై ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు భారం పడనున్నట్లు సీఎం పైర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ విధానంలో మార్పులు తీసుకొస్తామని జగన్ స్పష్టం చేశారు. సెంట్రల్‌ పే రివిజన్‌ కమిషన్‌ ప్రతిపాదనలనే యథాతథంగా తీసుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.., ఇక నుంచి ఈ పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని.., జూన్‌ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

    వారికి సొంత ఇళ్లు..
    ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

    ఇది చదవండి: రోజా చేసిన పని జగన్ ను ఇరుకున పెట్టిందా..? ప్రభుత్వంపై విమర్శలు తప్పవా..?


    వారికి 6నెలల్లో ప్రొబేషన్
    ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు)ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని జగన్ ఆదేశించారు. పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎస్ కమిటీ చెప్పిన విధంగా కాకుండా.. జనవరి నుంచే పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు.

    ఇది చదవండి: అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే.. వీళ్ల తెలివి మామూలుగా లేదు..

    ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
    కొత్త స్కేల్స్‌ను, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి 1 నుంచే, జనవరి జీతాలతోనే అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. అలాగే 2020 ఏప్రిల్‌ నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని ఇస్తామన్నారు. ఉద్యోగులకు అన్నిరకాలుగా మంచి చేయాలనే చేయాలనే ఉద్దేశంతో వారి రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నామని..., 1.1.2022 నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నామన్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు