AP CM YS JAGAN MOHAN REDDY KEY SPEECH ON PUBLIC HEALTH AT DAVOS 2022 FULL DETAILS HERE PRN
CM Jagan in Davos: దావోస్ లో సీఎం కీలక ప్రసంగం.. స్విస్ లో గ్రామ సచివాలయాల ప్రస్తావన..!
దావోస్ లో సీఎం జగన్
దావోస్ (Davos-2022) పర్యటనలో సీఎం జగన్ (AP CM YS Jagan) బిజీబీజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) లో రెండో రోజు ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ పై జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
దావోస్ (Davos-2022) పర్యటనలో సీఎం జగన్ (AP CM YS Jagan) బిజీబీజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) లో రెండో రోజు ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ పై జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టిందన్న జగన్., ప్రధానంగా ఏపీలో అత్యాధునిక మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు విషయంలో వెనుకబడి ఉందని.., కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణంమన్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి టయర్ -1 నగరాలు ఏపీలో లేనందున.. ప్రైవేటు సెక్టార్లో ఆత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని ముందే గుర్తించి., కోవిడ్ నియంత్రణలో భాగంగా 44 దఫాలుగా ఇంటింటికీ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు కూడా వైద్య, ఆరోగ్యరంగంలో చురుగ్గా పనిచేస్తున్నారని జగన్ వెల్లడించారు. వీరందరిని సమిష్టి చేసి... ఇంటింటికీ సర్వే చేస్తూ... తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగామని.., ఫలితంగా మరణాల రేటును కూడా తగ్గించగలిగామన్నారు జగన్.
ఆంధ్రప్రదేశ్‌లో 2వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 2 ప్రై మరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారని., ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారన్నారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారన్న సీఎం.., వీళ్లు రోజు తప్పించి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. ఆ గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా సేవలు అందిస్తారని.., తద్వారా ఆ గ్రామాల్లో ప్రజలను పేరు, పేరునా పలకరిస్తూ వారికి సేవలు అందించడంతో పాటు విలేజ్ క్లినిక్‌ను మెడికల్ హబ్‌గా ఉపయోగిస్తారని జగన్ తెలిపారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్ గ్రాడ్యుయేట్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీస్నర్, ఆశా వర్కర్లు ఉంటారు. వీళ్లంతా నివారణ చర్యల్లో చురుగ్గా పాల్గొంటారన్నారు.
ఇక ప్రతి పార్లమెంటును యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నామన్న జగన్., దీని వల్ల అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలు సమానంగా అందించాలన్నదే లక్ష్యమన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసినప్పుడే... పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారన్నారు. ఈ మొత్తం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16వేల కోట్ల సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నామని సీఎం జగన్ తెలిపారు.
"హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే... ప్రధాని శ్రీనరేంద్రమోదీ ఇండియాలో ఆయుష్మాన్భారత్ పథకం ప్రవేశపెట్టారు. దాదాపు వేయి చికిత్సావిధనాలు (ప్రొసిడ్యూర్స్) ఇందులో కవర్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మేము ప్రత్యేకంగా మా తండ్రిగారు పేరుమీద వైయస్సార్‌ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాం. ఏపీలో 2446 వరకూ చికిత్సలను వీటికింద అందిస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంపిణీ చేశాం. ఈ కార్డుకు అర్హతగా లబ్ధిదారుల ఆదాయపరిమితిని కూడా రూ.5లక్షలు వరకు పెంచాం. అంటే రూ.5లక్షలలోపు ఆదాయమున్న ప్రతి ఒక్కరూ ఈ కార్డు పొందడానికి అర్హులే. రాష్ట్రంలో దాదాపుగా 1.53 కోట్లు కుటుంబాలు ఉంటే.. మేం 1.44 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చే శాం. ఇందులో గత మూడేళ్లుగా 25 లక్షల మంది ఉచితంగా చికిత్స తీసుకున్నారు." అని జగన్ అన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.