Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN MOHAN REDDY KEY DECISION ON ANGANWAADI SCHOOLS AK

స్కూల్స్ తరహాలోనే అంగన్‌వాడీలు... సీఎం జగన్ కీలక నిర్ణయం

సీఎం జగన్

సీఎం జగన్

పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీల్లోనూ నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

    అంగన్‌వాడీలపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీల్లోనూ నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. దాదాపు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. అంగన్‌వాడీల్లో గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని సూచించారు. అంగన్‌వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఫ్రిజ్, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్‌ బోర్డులు, ప్రహరీగోడ సహా కావాల్సిన మరమ్మతులు చేసి, సదుపాయాలను కల్పించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

    దాదాపు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటిలో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు. పటిష్టంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి జూలైలో తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బకాయిలు లేకుండా గ్రీన్‌ ఛానల్‌లో చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Anganwadi, Ap cm ys jagan mohan reddy

    తదుపరి వార్తలు