హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan : తణుకులో జగనన్న గృహహక్కు పథకం ప్రారంభం.. అదే వాళ్ల కడపుమంటన్న సీఎం జగన్

YS Jagan : తణుకులో జగనన్న గృహహక్కు పథకం ప్రారంభం.. అదే వాళ్ల కడపుమంటన్న సీఎం జగన్

పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) విమర్శించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని (Jagananna Sampoorna Gruhahakku Scheme) ఆయన ప్రారంభించారు.

ఇంకా చదవండి ...

  పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) విమర్శించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని (Jagananna Sampoorna Gruhahakku Scheme) ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఓటీఎస్ ద్వారా 52లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ ద్వారా ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా ప్రజలు తమ ఇళ్లను విక్రయించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల ఆస్తిని ఎలాంటి ఛార్జీలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని ఆయన అన్నారు. రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి ఎదురుచూడకుండా గ్రామ సచివాలయాల ద్వారా కేవలం పది నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సీఎం వివరించారు.

  ప్రభుత్వం చేసే మంచి పనులను కొందరు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పాటు ఆయన అనుకూల మీడియా సంస్థలు ప్రజలకు మంచి చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వస్తే.. జగన్ ఉచిత ఇళ్లు ఇస్తే మీకెందుకు కడుపు మంట అని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి డాక్యుమంట్లు లేకుండా మా ఇళ్లను మార్కెట్ రేట్లకు కొంటారా అని నిలదీయాలన్నారు.

  ఇది చదవండి: సీఎం జగన్ హెల్త్ సీక్రెట్ ఏంటీ... ఆయనకు ఏఫుడ్ అంటే ఇష్టం..

  2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ప్రభుత్వం కట్టించిన ఇళ్ల రుణాలపై వడ్డీ కూడా మాఫీ చేయలేదని సీఎం జగన్ విమర్శించారు. కనీసం వడ్డీ మాఫీ చేయని వాళ్లు ఇప్పుడు విమర్శలుచేస్తున్నారన్నారు. 2014-19 మధ్యలో 43వేల మంది లబ్ధిదారులు 15కోట్ల 29లక్షలు చెల్లించిన వారికి యాజమాన్య హక్కులు కూడా ఇవ్వలేదన్నారు. డబ్బులు కట్టించుకొని కూడా యాజమాన్య హక్కులు ఇవ్వని ఘనత చంద్రబాబుదేనని జగన్ విమర్శించారు.

  ఇది చదవండి: ఏపీలో మద్యం ధరల తగ్గింపు వెనుక కారణాలివేనా..? పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది..?

  జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా నామమాత్రపు ఛార్జీలతో పేదవాడికి మంచి చేస్తున్నామన్నారు. 30నెలల కాలంలోనే జగనన్న ప్రభుత్వం అక్షరాల లక్షా 16వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లోనే వేశామన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి అధికారి, ప్రతి వాలంటీర్ ప్రజలకు వివరించాలని జగన్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారంతా పేదల పాలిట శత్రువులు అని మండిపడ్డారు.

  ఇది చదవండి: వాళ్ల పాపాన వాళ్లే పోతారు.. వైసీపీ నేతలపై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..

  ఇదే సభలో ఇంగ్లీష్ మీడియం అంశాన్ని కూడా లేవనెత్తారు సీఎం జగన్. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్నవారు వారి పిల్లలకు ఎందుకు ఇంగ్లిష్ చదువులు చెప్పిస్తున్నారని జగన్ ప్రశ్నించారు. పేదలకు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారన్నారు. అమరావతి రాజధాని అని చెబుతున్న పెద్దమనుషులు.. పేదలకు ఇళ్ల పట్టాలిస్తే కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకున్నారన్నారు. ఓటీఎస్ పథకాన్ని ఉగాది వరకు పొడిగిస్తున్నామని జగన్ ప్రకటించారు. స్వచ్ఛందంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని.. వీలైంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు