AP CM YS JAGAN MOHAN REDDY HOLDS REVIEW MEETING ON GOVERNMENT EMPLOYEES PRC ISSUE FULL DETAILS HERE PRN
AP PRC Update: పీఆర్సీపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్..?
వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతన సవరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతన సవరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించారు. ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీపైనే సీఎం ప్రధానంగా చర్చించారు. పీఆర్సీపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన జగన్.. ఎంతమేర పెంచాలనే అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా.. ఎంతమేర ఫిట్ మెంట్ ఇచ్చేందుకు సాధ్యమవుతుందనే అంశంపై అధికారులను ఆరా తీశారు. ఉద్యోగులకు ఇప్పటికే 27శాతం మధ్యంతర భృతి ఇస్తుండగా.. దానిపై ఎంతమేర ఫిట్ మెంట్ ఇస్తే ఖజానాపై భారం పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై సిద్ధం చేసిన నివేదికను అధికారులు సీఎంకు ఇచ్చారు. ఇటీవల తిరుపతిలో పర్యటించిన సందర్భంగా పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జీతాలు ఎంతమేరకు పెంచాలనే అంశంపై ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
అలాగే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విధంగా సీపీఎస్ రద్దు అంశం కూడా చర్చకు వచ్చింది. సీపీఎస్ రద్దు చేస్తే బడ్జెట్ పై పడే ప్రభావం.. నిధుల కేటాయింపు వంటి అంశాలపై సీఎం చర్చించారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తైనందున వారిని పర్మినెంట్ చేసే అంశంపై సీఎం అధికారులతో చర్చించారు. సచివాలయాల్లో 1.10 లక్షల మంది పనిచేస్తున్నందున వారిని పర్మినెంట్ చేస్తే జీతాల విషయంలో బడ్జెట్ పై పడే భారాన్ని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిచినట్లు తెలిసింది.
ఐతే పీఆర్సీ ప్రకటనలో ప్రభుత్వం సాంప్రదాయాన్ని పాటిస్తుందా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఉద్యోగ సంఘాలను పిలిచి తుదివిడత చర్చలు జరిపిన అనంతరం పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ఈసారి ప్రభుత్వం అలా చేస్తుందా..? లేక నేరుగా ప్రకటన చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు.. శుక్రవారం నుంచి భోజన విరామ సమయాల్లో నిరసన తెలపాలని నిర్ణయించాయి. పీఆర్సీ ప్రకటన వచ్చేవరకు తమ ఆందోళనలకు కొనసాగుతాయని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఐతే ట్రెజరీ ఉద్యోగులు మాత్రం సీఎం ఇప్పటికే ప్రకటన చేసినందున నిరసనల్లో పాల్గొనబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..!
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.