హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్..

YS Jagan: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్..

అత్యవసరంగా ల్యాండైన విమానం

అత్యవసరంగా ల్యాండైన విమానం

YS Jagan: కొద్దిసేపటి క్రితం గన్నవరం నుంచి సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరివెళ్లారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. కొద్దిసేపటి క్రితం గన్నవరం నుంచి సీఎం జగన్(YS Jagan) ఢిల్లీ బయలుదేరివెళ్లారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తినట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే తిరిగి గన్నవరం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి 5.03 గంటలకు టేకాఫ్ అయిన విమానం 5.20 నిమిషాలకు అత్యవసరంగా ల్యాండింగ్(Emergency Landing) అయ్యింది. విమానంలోని ఏసీలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానం తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేశారు. అయితే ఈ సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని భావించిన సీఎం జగన్.. కొద్దిసేపు విమానాశ్రయంలోనే ఎదురుచూశారు. అయితే అది ఇప్పటికప్పుడు పరిష్కారమయ్యే అవకాశం లేకపోవడంతో.. ఆయన తిరిగి తాడేపల్లి చేరుకున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం సీఎం జగన్ గన్నవరం(Gannavaram) నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోబోతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

షెడ్యూల్ ప్రకారం... రేపు ఉదయం 10.30 నుంచి 5.30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో జరగబోయే ఆంధప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమ్మిట్‌లో సీఎం జగన్ ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమం అనంతరం మంగళవారం సాయంత్రం 06.05 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం జగన్ కేంద్ర పెద్దలెవరినీ కలుసుకోవడం లేదు.

అంతకుముందు వినుకొండలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని విడుదల చేశారు. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని... వివక్ష లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు. వరుసగా ఈ మూడేళ్లలో అక్షరాల మూడు లక్షల ముప్పై వేల మందికి మంచి చేస్తూ.. నేడు రూ. 330 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తంగా జగనన్న చేదోడు కార్యక్రమంతో రూ. 927 కోట్లు జమ చేసినట్లు అవుతుందని తెలిపారు.

Jagananna Chedodu : జగనన్న చేదోడు..నేడే లబ్దిదారుల అకౌంట్లోకి రూ. 10వేలు

Tirumala: ఏపీలో ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు.. !

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోంది. మొత్తం 43 నెలల కాలంలోనే నేరుగా 1.92 లక్షల కోట్లు అందించామని, టీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్లు అందించామని సీఎం జగన్‌ వినుకొండ వేదిక నుంచి ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy