Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN MOHAN REDDY CONDUCTED REVIEW MEETING ON INDUSTRIES DEPARTMENT AND ISSUED KEY ORDER FULL DETAILS HERE PRN

YS Jagan: ఏపీలో పండే ధాన్యంపై జగన్ కీలక నిర్ణయం.. కొత్త ఉత్పత్తులపై దృష్టి.. వివరాలివే..!

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిశ్రమల శాఖపై సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, పరిశ్రమలపై ప్రధానంగా చర్చించారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిశ్రమల శాఖపై సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, పరిశ్రమలపై ప్రధానంగా చర్చించారు. గడచిన మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన భారీ, అతిభారీ యూనిట్లు 96 ఉండగా.. ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్‌ఎంఈలు 28,247గా ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు 28,343 ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమల రూపేణా వచ్చిన రూ. 47,490.28కోట్ల పెట్టుబడులు వచ్చాయని.., మొత్తం 2,48,122 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. అలాగే 61 కంపెనీలు భారీ, అతిభారీ పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయని.. వీటి పెట్టుబడి రూ.1,51,372 కోట్లుగా ఉందని.. ఈ పరిశ్రమల్లో ఉద్యోగాల సంఖ్య 1,77,147 అని తెలిపారు.

    నిర్మాణ పనులు మొదలుపెట్టనున్న యూనిట్లు సంఖ్య ఐదు కాగా.., తద్వారా రూ.1,365.88 కోట్ల పెట్టుబులు, 8,850 ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 92 పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయని.., ఆయా పరిశ్రమల ద్వారా మొత్తం రూ. 2,19.766 కోట్ల పెట్టుబడులు.., తద్వారా 3,19,829 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.

    ఇది చదవండి: ఏపీలో మరణాలకు ప్రధాన కారణం ఇదే.. సర్వేలో షాకింగ్ నిజాలు..


    ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలిచ్చారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. దీనివల్ల వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. విశాఖపట్నం – చెన్నై కారిడర్‌లో భాగంగా ఉన్న నక్కపల్లి నోడ్, కాళహస్తి నోడ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు.

    ఇది చదవండి: ఆ నేత కోసం తగ్గిన చంద్రబాబు.. ఇంటికెళ్లి రెండు గంటలు మీటింగ్..? 


    రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు మెరుగైన ప్రోత్సాహం అందించాలని.., సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయని సీఎం అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని.. వారికి పారిశ్రామిక ప్రోత్సహకాలు అందేలా చూడాలని సూచించారు.ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకాల కోసం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలనూ చెల్లించామని సీఎం గుర్తుచేశారు. ఒకే తరహా ఉత్పత్తులు అందిస్తున్న గ్రామాలు కూడా ఉన్నాయని.., వీటిని కూడా క్లస్టర్‌గా గుర్తించి, వారికి అండగా నిలవాలని స్పష్టం చేశారు.

    ఇది చదవండి: దూసుకొస్తున్న ఫోర్త్ వేవ్.. కరోనాపై వైద్యుల అలర్ట్.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు..


    పారిశ్రామిక విధానాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని.., నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలైన్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మనం చేసే పనులలో నిజాయితీ ఉంది కాబట్టే భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు వంటి బడా పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారన్నారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారన్నారు.

    ఇది చదవండి: ఏపీలో కాపు-కమ్మ కాంబినేషన్ సెట్ అవుతుందా..? పవన్ ప్రతిపాదనకు బాబు ఓకే చెప్తారా..?


    గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభించనుందని.., వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయన్నారు. దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూమిని ఈ ప్రాజెక్టులకు వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానున్నట్లు తెలిపారు. ఇలాంటి భూములను లీజు విధానంలో తీసుకుని, వారికి ప్రతిఏటా కూడా ఎకరాకు దాదాపు రూ.30వేల డబ్బు చెల్లించేలా విధానం తీసుకు వస్తున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా ధాన్యం పండిస్తున్నారని., ఆ బియ్యాన్ని వాడుకుని ఇథనాల్‌ తయారీపై దృష్టిపెట్టాలని సీఎం అదికారులకు సూచించారు. అలాగే ఆయిల్‌పాం ప్రాససింగ్‌ యూనిట్లపైనాకూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. త్వరలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహాణకు సమాయాత్తమవుతున్నామన్నట్లు అధికారులు వెల్లడించారు.



    ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జె సుబ్రమణ్యం పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు