కొత్త హీరో సినిమాకు క్లాప్ కొట్టిన సీఎం జగన్

జొన్నలగడ్డ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమోషన్ కోసం ‘జననేన జగనన్న’ పాటను కంపోజ్ చేసి ఇచ్చారు. ఆ పాట ఎంతో బాగుందని అప్పట్లో జగన్ అభినందించారు.

news18-telugu
Updated: October 12, 2019, 10:26 PM IST
కొత్త హీరో సినిమాకు క్లాప్ కొట్టిన సీఎం జగన్
ఆటో రజిని సినిమా బృందంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఓ సినిమాకు క్లాప్ కొట్టారు. ‘ఆటో రజిని’ పేరుతో వస్తున్న సినిమాకు జగన్ క్లాప్ కొట్టారు. జెఎస్ఆర్‌ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి.లింగుస్వామి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. జొన్నలగడ్డ హరికృష్ణ హీరో. ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాలో నటించిన ఈ హరికృష్ణ తన రెండో సినిమాకు జగన్ ఆశీస్సులు పొందారు. తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన సినిమా యూనిట్.. జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. వారి ‘ఆటో రజినీ’కి జగన్ ఆశీస్సులు అందజేశారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారిని జగన్ ప్రోత్సహించడం, తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చి దీవించడం ఆనందంగా ఉందని సినిమా యూనిట్ తెలిపింది. జొన్నలగడ్డ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమోషన్ కోసం ‘జననేన జగనన్న’ పాటను కంపోజ్ చేసి ఇచ్చారు. ఆ పాట ఎంతో బాగుందని అప్పట్లో జగన్ అభినందించారు. ఎన్నికలకు ముందు సుమంత్, అంజు కురియన్ జంటగా నటించిన ఇదం జగత్ సినిమా టీజర్‌ను జగన్ రిలీజ్ చేశారు.

YSR Vahana Mitra, YSR Vahana Mitra apply online, YSR Vahana Mitra scheme, YSR Vahana Mitra last date, Andhra Pradesh Auto Drivers scheme, Rs 10000 Financial assistance for Auto drivers, AP CM YS Jaganmohan reddy, AP CM Jagan, YS Jagan, AP CM YS Jagan, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తు, వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం, వైఎస్ఆర్ వాహనమిత్ర చివరి తేదీ, ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సన్మానిస్తున్న ఆటో డ్రైవర్లు (image: @AndhraPradeshCM/twitter)


ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 4న ఏలూరులో ప్రారంభించారు. ఆ సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆటోవాలా గెటప్‌లో కనిపించారు.
First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading