హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: రూ.10 లక్షల పరిహారం.. బాణాసంచా పేలుడుపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

Andhra Pradesh: రూ.10 లక్షల పరిహారం.. బాణాసంచా పేలుడుపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

AP Fire Accident: ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ పరిమితికి మించి బాణాసంచా నిల్వచేసినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిర్వాహకుడు అన్నవరం కోసం గాలిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Tadepalligudem

పశ్చిమ గోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద (Fire accident) ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jagan mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి మెరుగైన వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.

Modi-Pawan Kalyan: విశాఖకు పవన్ కళ్యాణ్ .. ప్రధాని మోదీతో భేటీ.. అంతా తేలిపోతుందా ?

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కడియద్ద వద్ద గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.  ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.  ఈ  ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఇద్దరు స్పాట్‌లోనే చనిపోగా.. 80 శాతం గాయాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూశారు. బాణాసంచాను ఓ వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించి వారిలో ఇద్దరి శరీర భాగాలు పేలుడు ధాటికి తునాతునకలయ్యాయి.  వీరి వివరాలు తెలియాల్సి ఉంది.

Sajjala on Vijaysaireddy: లిక్కర్ స్కామ్ లో విజయసాయి అల్లుడి అరెస్ట్..! సజ్జల ఏమన్నారంటే..?

ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన యాళ్ల ప్రసాద్‌ తీవ్రంగా గాయపడడంతో.. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.  అనంతపల్లి గ్రామానికి చెందిన సోలమన్ రాజు తాడేపల్లి గూడెం (Tadepalligudem) ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం నుంచి మరో ఇద్దరు తప్పించుకున్నారు. వంట చేసేందుకు ఒక మహిళ ఇంటికి వెళ్లడం.. టిఫిన్ తీసుకురావడానికి మరో వ్యక్తి బయటకు వెళ్లడంతో.. వారిద్దరు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.  ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి సత్యనారాయణ స్వయంగా అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ పరిమితికి మించి బాణాసంచా నిల్వచేసినట్లు తెలుస్తోంది. బాణాసంచా తయారీ కేంద్రాన్ని పండూరి అన్నవరం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రమాదం తర్వాత అతడు పారిపోయాడు. అన్నవరం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Crackers, Fire Accident

ఉత్తమ కథలు