Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN MEETS CEOS OF STARTUP COMPANIES IN DAVOS TOUR FULL DETAILS HERE PRN

Jagan in Davos: స్టార్ట్ అప్ హబ్ గా విశాఖ.. సాగరతీరానికి పెట్టుబడుల వరద..

దావోస్ లో సీఎం జగన్

దావోస్ లో సీఎం జగన్

దావోస్ (Davos-2022) పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan).. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు పలు కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యూనికార్న్ స్టార్టప్స్ హబ్ గా విశాఖపట్నం (Visakhapatnam) ను తీర్చిదిద్దే క్రమంలో పలు కంపెనీల వ్యవస్థాపకులు, సీఈవోలతో సీఎం భేటీ అయ్యారు.

ఇంకా చదవండి ...
    దావోస్ (Davos-2022) పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan).. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు పలు కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యూనికార్న్ స్టార్టప్స్ హబ్ గా విశాఖపట్నం (Visakhapatnam) ను తీర్చిదిద్దే క్రమంలో పలు కంపెనీల వ్యవస్థాపకులు, సీఈవోలతో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో కంపెనీలు నెలకొల్పేందుకు అవసరమైన వనరులు సమకూరుస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇక ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామన్న బైజూస్‌., పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని ప్రకటించింది. సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ తెలిపింది. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామన్న ఈజ్‌మై ట్రిప్‌.., ఏపీ పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని చెప్పింది.

    యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్‌ అన్నారు. పీలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్‌ కార్యకలాపాలను ముమ్మరంచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందరికీ ఆహ్వానం పలుకుతోందని వెల్లడించారు. విధాన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం వీరితో చర్చించారు. స్టార్టప్‌లు అభివృద్ధిచెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని సీఎం అన్నారు.

    ఇది చదవండి: గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ.. రూ.1.25లక్షల కోట్ల ఒప్పందాలు


    ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట, పబ్లిక్‌పాలసీ సుష్మిత్‌ సర్కార్‌ ప్రకటించారు. ఏపీ విద్యకు సంబంధించి పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, బైజూస్‌ పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామన్నారు. ఏపీలో సమగ్ర భూసర్వే, రికార్డుల భద్రపరచడం.. ఈఅంశంలో సాంకేతిక పరిజ్ఞానం అంశంపై కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివి ఆఫీసర్‌ ఆశిష్‌ సింఘాల్‌తో సీఎం చర్చించారు. సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని సింఘాల్‌ తెలిపారు.

    ఇది చదవండి: ఏపీలో పెరిగిన ఇళ్లు, ఫ్లాట్ల ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత పెరిగాయో తెలుసా..?


    ఏపీలో పర్యాటక రంగ అంశంపై ఈజ్‌మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టితో సీఎం చర్చించారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామని, ఏపీ పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని ప్రశాంత్‌ తెలిపారు.

    ఇది చదవండి: పని ఒత్తిడిలో అలసిపోయారా.. ఇక్కడికి వెళ్తే రిలీఫ్ గ్యారెంటీ..!


    ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్‌ ఆత్రేయ, బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ పబ్లిక్‌పాలసీ సుష్మిత్‌ సర్కార్, కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ ఆశిష్‌ సింఘాల్, ఈజీమై ట్రిప్‌ ప్రశాంత్‌పిట్టి, వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్, కొర్‌సెరా వైస్‌ ప్రెశిడెంట్‌ కెవిన్‌ మిల్స్‌ ఉన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు