Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN LAUNCHES JAGANANNA SMART TOWNSHIP SCHEME AND WEBSITE FULL DETAILS HERE PRN

Jagananna Smart Townships: ఏపీలో తక్కువ ధరకే ప్లాట్లు.. ప్రభుత్వం సరికొత్త పథకం.. సీఎం జగన్ శ్రీకారం..

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లస్థలాలను కేటాయించే జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పథకాన్ని (Jagananna SmartTownship) సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లస్థలాలను కేటాయించే జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పథకాన్ని (Jagananna SmartTownship) సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. లబ్దిదాదురలకు ఎలాంటి వివాదాలు, లిటిగేషన్లు లేని క్లియర్ డాక్యుమెంట్ తోమార్కెట్ కంటే తక్కువ ధరకే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తమని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలకు అన్ని వసతులు ఉన్న స్థలాలిస్తామన్నారు. ఈ పథకంలో మూడు కేటగిరీల్లో 150 గజాలు, 200 గజాలు, 240 గజాలల్లో ప్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం తెలిపారు, మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి, కడపజిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లే అవుట్లు వేశామన్నారు.

  వీటి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంచినట్లు జగన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌ లైన్‌ అప్లికేషన్ పెట్టుకోవచ్చారు. ఈ ఆరు జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ పథకాన్ని విస్తరిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ టౌన్స్ లో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకమైన వెబ్ సైట్ ను సిద్ధం చేశామన్నారు.

  ఇది చదవండి: ఆ పదాన్ని సరిగ్గా పలికితే తప్పుకుంటా.. సీఎంకు రఘురామ సవాల్..! సంక్రాంతి వస్తానన్న రాజుగారు


  రూ.18లక్షల వార్షికాదాయం ఉన్నవారు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని జగన్ ప్రకటించారు. ప్లాట్లకు అయ్యే నగదును నాలుగు వాయిదాల్లో ఏడాదిలోగా చెల్లించే అవకాశం కల్పిస్తామన్నారు. చివరి వాయిదా చెల్లింపు పూర్తైన వెంటనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. తొలి వాయిదాలో 10శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, ఆరు నెలల్లోపు 30శాతం రిజిస్ట్రేషన్ చేసుకునేనాటికి అంటే ఏడాది లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తే పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. ఒకేసారి పూర్తి మొత్తం చెల్లిసే 5శాతం రాయితీ ఇస్తామని జగన్ ప్రకటించారు.

  ఇది చదవండి: హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్ కు మేం రెడీ.. జగన్ కు సోము వీర్రాజు సవాల్


  ఇక ఇళ్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్లో 10శాతం ప్లాట్లను 20శాతం రిబేట్ తో కేటాయిస్తామని సీఎం జగన్ తెలిపారు. స్మార్ట్ టౌన్స్ లో పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా ప్లానింగ్ శాఖ నిబంధనల మేరకు ఏడాదిలోగా అభివృద్ధి చేసిస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వ లే అవుట్లను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే దరఖాస్తు చేసుకున్నవారికి లే అవుట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకతను పాటిస్తామని సీఎం స్పష్టం చేశారు.

  ఇది చదవండి: ఏపీలో నైట్ కర్ఫ్యూ విధింపు.. కొత్త టైమింగ్స్, రూల్స్ ఇవే..!


  ఈ లేవుట్లలో పార్కులు, రోడ్లు, ఫుట్ పాత్ లు, మంచినీటి సరఫరా, డ్రెయినేజీ వ్యవస్థ, వరదనీటి డ్రెయినేజ్ వ్యవస్థను కూడా నిర్మిస్తామని జగన్ తెలిపారు. అలాగే విద్యుత్, వీధి దీపాల వంటి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే ఈ టౌన్ షిప్ ల మెయింటెనెన్స్ కు కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు