Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN LAUNCHED YSR RYTHU BHAROSA FIRST PHASE IN WEST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Rythu Bharosa: రైతుల ఖాతాల్లో లక్ష కోట్లు.. తగ్గేదేలేదన్న జగన్.. రైతు భరోసాకి సీఎం శ్రీకారం..

రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన జగన్

రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన జగన్

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ (AP CM YS Jagan) అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) మొదటి విడత నిధులను విడుదల చేశారు.

    చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ (AP CM YS Jagan) అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) మొదటి విడత నిధులను విడుదల చేశారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన తేదీకి వైఎస్ఆర్ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. వరుసగా నాలుగో ఏడాది పథకాన్ని అమలు చేస్తున్నామని.. నాలుగో ఏడాది మొదటి విడతగా రూ.7,500, కోత సమయానికి రూ.4,500, సంక్రాంతికి పంట చేతికొచ్చే సమయానికి రూ.2,500 ఇస్తున్నామన్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కింద రూ.5500 నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మరో రెండు వేలు ఈ నెలాఖరుకు పీఎస్ కిసాన్ యోజన కింద కేంద్రం విడుదల చేస్తుందన్నారు.

    మూడేళ్లలో 50లక్షలమందికి పైగా రైతులకు ఒక్కొక్కొరికి రూ.7,500 చొప్పున రూ.3,758 కోట్లు జమవుతుందన్నారు. ఇప్పటివరకు తాము అదికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద రూ.23,875 కోట్లను నేరుగా రైతున్నల ఖాతాల్లో వేశామని జగన్ తెలిపారు. వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో రైతులకు రూ.1,10093 కోట్లు ఇచ్చామన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి రిజర్వాయర్ కూడా సకాలంలో పూర్తిగా నిండిందన్నారు.

    ఇది చదవండి: ఇల్లుకట్టినా.. బంగారం పంచినా.. కుప్పం ఫలితం అదే..! 


    గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిందేమీ లేదని.. తమ ప్రభుత్వం మాత్రం సకాలంలో వారికి అండగా ఉంటూ నేరుగా ఆర్ధిక సాయం చేస్తున్నామన్నారు. దురదృష్టవశాత్తూ రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు కూడా సాయం చేస్తున్నామన్నారు.

    ఇది చదవండి: ఆ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎంపీ.. సీఎం వద్దకు చేరిన పంచాయతీ.. వైసీపీలో ఏం జరుగుతోంది..?


    ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం అందించడం దేశచరిత్రలో ఇదే మొదటిసారని సీఎం అన్నారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రైతులను తరపునే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ఆర్బీకేల్లో ఈ-క్రాప్ నమోదు చేసిన వెంటనే వారిని ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొస్తున్నామన్నారు. రైతులకు ఇలాంటి సాయం చేయాలంటే వ్యవసాయం మీద, రైతుల మీద, వారి కష్టమ్మీద అవగాహన ఉండాలన్నారు. కానీ గత ప్రభుత్వానికి ఇవేమీ లేవని జగన్ విమర్శించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది వచ్చినా స్పందించే ప్రభుత్వం ఇదన్నారు.

    ఇది చదవండి: జగన్ ఇలాకాలో చంద్రబాబు.. సీమ టూర్ ప్లాన్ చేసిన టీడీపీ..! అక్కడ కూడా బాదుడే బాదుడు..!


    గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులు, కౌలు రైతులు, ఆర్ఏఎఫ్ భూములు సాగు చేసుకుంటున్నవారికి రైతు భరోసా పేరుతో సాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అని పశ్నించారు. వైఎస్ఆర్ సున్నావడ్డీ ద్వారా 65 లక్షల మంది రైతులకు రూ.1,285 కోట్లు ఇస్తే.. గత ప్రభుత్వం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు సీఎం. ఇప్పటివరకు రూ.31వేల కోట్లకు పైగా నగదును రైతులకు ఇన్సూరెన్స్ రూపంలో జమ చేసినట్లు జగన్ గుర్తుచేశారు. సన్న చిన్నకారు ఆక్వా రైతులకు విద్యుత్ విషయంలో ప్రభుత్వమే ఆక్వా జోన్లో ఉన్న రైతులకు 10 ఎకరాల వరకు రూపాయిన్నర వరకు విద్యుత్ సబ్సిడీ కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Rythu Bharosa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు