Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN LAUNCHED YSR MOBILE VETERINARY HOSPITALS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP Animal Ambulances: ఏపీలో కొత్త కార్యక్రమం.. ఈ నెంబర్ కు కాల్ చేస్తే ఇంటికే పశువైద్యం.. ప్రారంభించిన జగన్..

ఏపీలో పశువుల అంబులెన్సుల ప్రారంభం

ఏపీలో పశువుల అంబులెన్సుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ Ration Door Delivery) వాహనాలతో రేషన్, 108, 104తో వైద్యసేవలను ప్రజలకు చేరువ చేస్తున్న జగన్ సర్కార్.. ఇకపై పశువులు, మూగజీవాలకు కూడా మొబైల్ వైద్య సేవలను అందించనుంది

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ Ration Door Delivery) వాహనాలతో రేషన్, 108, 104తో వైద్యసేవలను ప్రజలకు చేరువ చేస్తున్న జగన్ సర్కార్.. ఇకపై పశువులు, మూగజీవాలకు కూడా మొబైల్ వైద్య సేవలను అందించనుంది. రాష్ట్రంలోని పశుపోషకుల ఇంటి వద్దే మూగజీవాలకు అత్యున్నత వైద్యం అందించేందుకు వైఎస్ఆర్ సంచార పశువైద్య సేవల (YSR Mobile Veterinary Hospitals) వాహనాలను సీఎం జగన్ (AP CM YS Jagan) గురువారం ప్రారంభించారు. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్సులను తాడేపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.273 కోట్లతో 340 అంబులెన్సులను ప్రభుత్వం అందించనుంది. అంబులెన్సుల ప్రారంభానికి ముందు వాహనాలను పరిశీలించిన సీఎం జగన్.. అందులో ఉన్న సదుపాయాలు, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

    తొలిదశలో 175 అంబులెన్సులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. రెండో దశలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున పశువుల అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. నెలనెలా వీటి నిర్వహణ వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుంది. అంతేకాదు ఇందుకోసం 1962 తో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    ఇది చదవండి: లండన్ కోర్టులో జగన్ సర్కార్ చారిత్రక విజయం.. కీలక కేసులో గెలుపు.. వివరాలివే..!


    పశుపోషకులు తమ మూగజీవాలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే 1962 నెంబర్ కు కాల్ చేస్తే.. మొబైల్ హాస్పిటల్ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. అక్కడే వైద్యం చేసి నయం చేసేందుకు యత్నిస్తుంది. ఏదైనా పెద్దవ్యాధి అయినా, సర్జరీ అవసరమైనా అంబులెన్సులోనే సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందిస్తారు. ట్రీట్ మెంట్ పూర్తయిన తర్వాత అదే వాహనంలో తిరిగి రైతు ఇంటికి తీసుకొస్తారు. ఇలాంటి అంబులెన్సులు పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. హద్దుమీరితే జరిమానా గ్యారెంటీ..!


    పశువుల అంబులెన్సులో ఒక వెటర్నరీ డాక్టర్, వెటర్నరీ డిప్లొమా చేసిన హెల్పర్ తో పాటు డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. అలాగే అందులోనే పేడ సంబంధిత 20 రకాల పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రో స్కోప్ వంటి పరికరాలతో కూడిన చిన్నసైజు ల్యాబ్ ఉంటుంది. వీటితో పాటు పశువులకు అవసరమైన అన్నిరకాల వ్యాక్సిన్లు, మందులుతో పాటు పశువులను అంబులెన్సులోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇదే వాహనంలో ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు కూడా చేస్తారు.  ఈ అంబులెన్సులను పాడి రైతులు మాత్రమే కాకుండా గొర్రెలు, కోళ్ల పెంపకం దారులు కూడా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు