హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: రైతుల చేయిపట్టి నడిపిస్తున్నాం..చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం.. సీఎం జగన్

YS Jagan: రైతుల చేయిపట్టి నడిపిస్తున్నాం..చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం.. సీఎం జగన్

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

రాష్ట్రంలోని రైతులకు తోడుగా ఉంటూ వారిని చేయిపట్టుకొని నడిపిస్తున్నామని ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లిలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

రాష్ట్రంలోని రైతులకు తోడుగా ఉంటూ వారిని చేయిపట్టుకొని నడిపిస్తున్నామని ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లిలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రూ.2978 కోట్లను 15.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేస్తున్నామన్నారు. గతంలో రాయలసీమకు కరువు సీమ అని, అనంతపురంకు ఏడారి జిల్లా అనే పేరుండేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని జగన్ అన్నారు. గతంలో పంట బీమా ఎప్పుడు వస్తుందో లేదో తెలియని పరిస్థితులండేవని.. కానీ ఇప్పుడు మాత్రం ఏ సీజన్ లో నష్టం జరిగితే ఏడాది లోపే నేరుగా రైతుల చేతుల్లోకకే వచ్చే మార్పును తీసుకొచ్చామని జగన్ అన్నారు.

గత ప్రభుత్వ పాలనలో ఐదేళ్లకు కలిపి పంట బీమా కింద 38లక్షల 85వేల మంది రైతులకు రూ.3,411 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఇప్పుడు తమ హయాంలో మూడేళ్లలోనే 44లక్షల 28వేల మంది రైతులకు రూ.6,685 కోట్లు ఇచ్చామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.717 కోట్ల బకాయిలను కూడా తామే చెల్లించామన్నారు. రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నామని గర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకు మంచి చేసే విషయంలో దేశంతోనే పోటీపడుతున్నామని జగన్ అన్నారు.


ఇది చదవండి: లోకేష్ మాటలతో షాక్ లో ఆ సీనియర్ నేత.. ఇక ఇంటికి పరిమితం కావలసిందేనా..?

ఇతర రాష్ట్రాలతో పాటు, కేంద్రం ప్రభుత్వ పెద్దలు కూడా ఏపీకి వచ్చి అక్కడ కూడా అమలు చేసే పరిస్థితి ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వమే రైతుల పేరిట ఇన్సురెన్స్ ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోందని జగన్ తెలిపారు. ఏ పంట సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్ ముగిసేలోపే నష్టపరిహారం చెల్లిస్తున్నామని సీఎం అన్నారు. ఈ విధానం ఎలా సాధ్యమా అని దేశం మొత్తం.. ఏపీ వైపు చూస్తోందని చెప్పారు. ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో మూడేళ్లలో రూ.1,613 కోట్లను రైతులు ఖాతాల్లో వేశామని జగన్ చెప్పారు.

మూడేళ్లలో రైతులకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.1,263 కోట్లు చెల్లించామన్నారు. గతంలో చంద్రబాబు కేవలం రూ.782 కోట్లు మాత్రమే చెల్లించామన్నారు. ఈ మూడేళ్లలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి 24,424 మందికి ఉద్యోగాలిచ్చామన్నారు. రైతులకు ప్రతి అంశంలోనూ ఆర్బీకేలు అండగా ఉంటున్నాయన్నారు. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా యంత్రపరికరాలను కూడా తక్కువ ధరకే అందిస్తున్నామని చెప్పారు. ఉచిత ఉద్యుత్ కింద మూడేళ్లుగా రైతులకు రూ.25,800 కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ బకాలు, ధాన్యం బకాయిలు 960 కోట్లు మేమే చెల్లించామన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చరిత్రలో ఎన్నడూ లేని నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు