హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSR Kapu Nestham: కాపునేస్తం మూడో విడత నగదు జమ.. కాపులకు రూ.32వేల కోట్లు ఇచ్చామన్న సీఎం

YSR Kapu Nestham: కాపునేస్తం మూడో విడత నగదు జమ.. కాపులకు రూ.32వేల కోట్లు ఇచ్చామన్న సీఎం

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసింది. ఇప్పటికే ఈ ఏడాది రైతు భరోసా (Rythu Bharosa), విద్యాదీవెన, విద్యాకానుక, అమ్మఒడి (Jagananna Ammavodi) వంటి పథకాలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా కాపునేస్తం పథకం కింద నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసింది. ఇప్పటికే ఈ ఏడాది రైతు భరోసా (Rythu Bharosa), విద్యాదీవెన, విద్యాకానుక, అమ్మఒడి (Jagananna Ammavodi) వంటి పథకాలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా కాపునేస్తం పథకం కింద నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడ జిల్లా (kakinada District) గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో మూడో విడత కాపునేస్తం పథకాన్ని సీఎం జగన్ (AP CM YS  Jagan)  ప్రారంభించారు. మేనిఫెస్టోలో బీసీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అందిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తున్నట్లు సీఎం అన్నారు. కాపు నేస్తం ద్వారా మొదటి ఏడాది 3క్షల మందికి పైగా మహిళలకు 490 కోట్లు ఇచ్చామని.. 3,27,244 మందికి మరో రూ.490 కోట్లు ఇచ్చామని జగన్ చెప్పారు. ఒక్కరు కూడా పథకం అందకుండా మిగిలిపోకూడదనే తపనతో అడుగులు ముందుకు వేస్తున్నామని జగన్ అన్నారు. వరుసగా మూడో ఏడాది 3,38,792 మంది మహిళ ఖాతాల్లో రూ.508 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. కాపు నేస్తం పథకంపై మూడేళ్లలో రూ.1,492 కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్.

నవరత్నాల్లో పథకాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు జగన్ వివరించారు. దీంతో పాటు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, ఇతర పథకాల ద్వారా కాపు కుటుంబాలకు మరో రూ.16వేల కోట్లు ఇచ్చామన్నారు. కాపులకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఇస్తామన్న చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని జగన్ విమర్శించారు. హామీలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మేనిఫెస్టోలో ప్రతి ఏటా రూ.2వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.32,290 కోట్లు ఇవ్వగలిగామని సీఎం చెప్పారు.

ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 26వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వివరాలివే..


కాపులకు నేస్తం మాత్రమే కాదని.. చేతల ద్వారా వారికి కాపు కాస్తామన్న విషయాన్ని స్పష్టంగా చూపించామని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం కేవలం బడ్జెట్ లో లెక్కలు చూపించి వివిధ కులాలను మోసం చేసిందన్నారు. మూడేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వెళ్లి మేలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. తమకు ఓటు వేయని వారికి కూడా మంచి చేయగలిగామన్నారు. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడా లేదన్నారాయన. గతంలో అధికార పార్టీకి చెందిన వారికే పథకాలు అందేవని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని జగన్ అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, YSR Kapu Nestham

ఉత్తమ కథలు