ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మీ సేవ (Mee Seva) తరహాలోనే కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్(సీఎస్‌పీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. దీనిని ఏపీ సేవ పేరుతో ఈ పోర్టల్‌ను లాంఛ్ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా సేవలు అందుతాయని తెలిపారు. ఒక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధకు అనుసంధానంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్ధ ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 1.34 లక్షలమంది రెగ్యులర్ ఉద్యోగులు దాదాపుగా పనిచేస్తున్న సీఎం.., 2.60వేలమంది ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున గ్రామ స్థాయిలో, ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటర్ చొప్పున మున్సిపల్ స్థాయిలో ఉన్నారని చెప్పారు. ఇలా మొత్తంగా దాదాపు 4 లక్షలమంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారని.., గ్రామ స్వరాజ్యానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికపై 540కు పైగా ప్రభుత్వ సేవలు మెరుగైన పరిస్థితిలోకి అందుబాటులోకి వస్తాయని.., ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అక్షరాల 3.46 కోట్ల మందికి మేలుచేస్తూ గ్రామ, వార్డు స్ధాయిలోనే సేవలు అందించినట్లు జగన్ గుర్తు చేశారు.
ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తాము ఇచ్చిన అర్జీ ఎక్కడ ఉందీ..? ఏ స్థాయిలో ఉంది..? ఎవరిదగ్గర ఎన్నిరోజులనుంచి పెండింగ్‌లో ఉందీ అన్న విషయాన్ని నేరుగా తెలుసుకోవచ్చుని సీఎం తెలిపారు. దీని ద్వారా మరింత వేగంగా పనులు జరుగుతాయన్నారు. దరఖాస్తుదారుడుతో పాటు సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలను తెలుసుకోవచ్చు. దీనివల్ల వేగం, బాధ్యత పెరుగుతాయన్నారు. ప్రజలకు అందించే ఈ సేవలన్నింటినీ కూడా పూర్తిగా డిజటలైజ్ చేస్తున్నామని,. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులనుంచి మండల స్థాయి, మున్సిపాల్టీలు ఆ తర్వాత జిల్లా స్థాయి, చివరకు రాష్ట్ర స్థాయి సచివాలయంలో ఉన్న ఉన్నతస్ధాయి ఉద్యోగులు అందరూ కూడా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా పనిచేయడం మొదలుపెడతారని సీఎం జగన్ తెలిపారు.
డాక్యుమెంట్లపై డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఉద్యోగుల జవాబుదారీతనం మరింత పెరుగుతుందని., ప్రతి ఉద్యోగి కూడా తన డిజిటల్ సిగ్నేచర్ చేస్తే... క్లియర్‌గా అది అందరికీ కనిపిస్తుందన్నారు. అంతే కాకుండాఈ వ్యవస్ధలో సేవలు పొందడంలో అవినీతి దూరం అవుతుందన్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు కోసం ఎవరి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం తెలిపారు. ఎవరి దగ్గరికీ వెళ్లి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందనేదని.., వాళ్లంతటవాళ్లే చూసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్ లోనే దరఖాస్తులను ఆమోదించే పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు జారీలో ఆలస్యానికి తావుండదని అభిప్రాయపడ్డారు.
అటు ప్రభుత్వ శాఖలు ఇటు ప్రజల మధ్య వారధిగా ఉండే హబ్‌గా.. గ్రామ, వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసే విధంగా..ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా సాధ్యపడుతుందని సీఎం అన్నారు. ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే పక్కాగా రశీదు వస్తుందని దాని వల్ల దరఖాస్తులు మిస్సయ్యే పరిస్థితి ఉండదన్నారు. ఏపీ సేవా పోర్టల్‌ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చినట్లు జగన్ తెలిపారు. మున్సిపాల్టీలకు సంబంధించిన 25 సేవలు, పౌరసరఫరాలకు చెందిన 6 సేవలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్‌రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలనుకూడా పోర్టల్ కిందకు తీసుకు వచ్చినట్లు వెల్లడించారు.
ఎక్కడనుంచైనా దరఖాస్తు...
ప్రజలు తమకు సంబంధించిన సచివాలయంలే కాకుండా ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాన్నట్లు జగన్ తెలిపారు. అలాగే ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఏపీ సేవ పోర్టల్‌ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Village secretariat