పిల్లలకు మంచి చదువులందిస్తేనే వారు పేదరికం నుంచి బయటపడాతరని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని (Jagananna Vidyakanuka) ఆయన ప్రారంభించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి రూ.931 కోట్లతో విద్యాకానుక కిట్లను అందించే కార్యక్రమాని శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో విద్యారంగంలో సమూలమార్పులు చేస్తున్నామని సీఎం జగన్ (AP CM Jagan) అన్నారు. పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించేలా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. బడికి వెళ్తున్న పిల్లలకు వరుసగా మూడో ఏడాది అమ్మఒడి పథకాన్ని అందించామన్నారు. అలాగే నాడు నేడు పేరుతో స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందిస్తున్నామని జగన్ తెలిపారు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు వివిధ పథకాల ద్వారా మంచి చేస్తున్నట్లు వెల్లడించారు.
రాబోయే తరాన్ని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అందుకే విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే విద్యాకానుక అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులు ఇస్తున్నామన్నారు. ఇందులో ఖర్చు పెరిగినా ఎక్కడా వెనుకాడకుండా విద్యాకానుకను అమలు చేస్తున్నట్లు వివరించారు. విద్యాకానుక కింద 2020లో రూ.635 కోట్లు, 2021లో రూ.790 కోట్లు, 2022-23లో రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు.
ఇది చదవండి: ప్లీనరీకి విజయమ్మ రాకపై సస్పెన్స్..! వైసీపీలో జోరుగా చర్చ..!
ఈ ఏడాది విద్యాకానుకతో పాటు 8వ తరగతిలో అడుగుపెట్టిన విద్యార్థికి సెప్టెంబరులో రూ.12 వేల విలువైన ట్యాబ్ ను అందిస్తామని జగన్ ప్రకటించారు. 4.7 లక్షల మంది పిల్లలకు రూ.500 కోట్లతో ట్యాబ్ లు ఇస్తున్నామన్నారు. ఈ ట్యాబ్ లో బైజూస్ యాప్ ను ఉచితంగా ట్యాబ్ లో అప్ లోడ్ చేస్తామన్నారు. దీంతో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బడికి పంపే పిల్ల సంఖ్యను పెంచేందుకే ఇలాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. చదువు వల్లే సామాజిక, ఆర్ధిక అంతరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
విద్యారంగంలో జగనన్న గోరుముద్ద, నాడు-నేడు, విద్యాకానుక, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు బైజూస్ ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు జగన్ తెలిపారు. పేద పిల్లలంతా జీవితంలో ఎదగాలన్న తపనతోనే ఇవన్నీ చేస్తున్నామన్నారు. ఈ మూడేళ్లలో అమ్మఒడిపై రూ.19,617వేల కోట్లు, రీయింబర్స్ మెంట్ కోసం రూ.7,700 కోట్లు, వసతి దీవెన కోసం రూ.3,329 కోట్లు, జగనన్న గోరుముద్ద పథకంపై రూ.1,850 కోట్లు, విద్యాకానుకపై రూ.900 కోట్లు, బైజూస్ పై రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government