Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN LAUNCHED DISHA VEHICLES AT SECRETARIAT ASSURED SAFETY FOR WOMEN IN THE STATE FULL DETAILS HERE PRN GNT

YS Jagan: ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదు.. దిశ వాహనాలు లాంఛ్ చేసిన జగన్..

సీఎం వైఎస్ జగన్

సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళల లక్షణ కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశా పెట్రోలింగ్ వాహనాలను సీఎం జగన్ (CM YS Jagan) సచివాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళల లక్షణ కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశా పెట్రోలింగ్ వాహనాలను సీఎం జగన్ (CM YS Jagan) సచివాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రికార్డు సంఖ్యలో 1 కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతిలో దిశ యాప్‌ ఉందని.., దాదాపుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్‌ వ్యవస్థ కూడా పనిచేస్తుందని ఆయన అన్నారు. వీటన్నింటితో ఒక గొప్ప విప్లవానికి, ఒక మార్పుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎక్కడైనా ఒక అక్కచెల్లెమ్మ మీద ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తున్నమని జగన్ అన్నారు.

    సామాన్యులకే కాకుండా.. పోలీసు వృత్తిలో ఉన్న మహిళలకు కూడా మంచి చేసే దిశగా అడుగులు పడ్డాయని జగన్ అన్నారు. ఇంతకుముందు పోలీస్‌ స్టేషన్‌లలో మహిళలకు ప్రత్యేకంగా రెస్ట్‌రూమ్‌ ఉండేది కాదని.., ఈ రోజు ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు ఉండటంతో పాటు బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ రోజు ప్రత్యేకంగా వాష్‌ రూమ్స్, డ్రెస్సింగ్‌ రూములు ఉండే విధంగా... 18 కార్‌ వాన్స్‌ను కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం 30 కార్‌ వాన్స్‌ ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయని.., మరో 12 రాబోయే రోజుల్లో వస్తాయని తెలిపారు. కార్‌వాన్స్‌తో పాటు 163 దిశ పోలీస్‌ ఫోర్‌వీల్‌ వాహనాలను కూడా ప్రారంభిస్తున్నామని.., ఇప్పటికే 900 దిశ ద్విచక్రవాహనాలు వివిధ పోలీస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.

    ఇది చదవండి: పోలవరం వద్ద ముగిసిన ఇసుక వివాదం.. సారీ చెప్పిన జేపీ వెంచర్స్..

    పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న.. ప్రతి వాహనాన్ని అంటే దాదాపు మూడువేల వాహనాలను జీపీఎస్‌ ట్యాగింగ్‌ చేసి, దిశకు అనుసంధానం చేసి వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చినట్లు జగన్ వివరించారు. ఏదైనా ఆపదలో ఉన్న మహిళలు తన ఫోన్‌ను ఐదుసార్లు షేక్ చేస్తే.. 10 నిమిషాల్లోనే పోలీసులు వారి దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తారన్నారు. డీఐజీ పాలరాజు, డీజీపీ రాజేంధ్రనాథ్‌ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ విషయంలో బాగా కృషి చేశారని., అందరూ కలిసికట్టుగా ఆ రెస్పాన్స్‌ టైంను ఇంకా కుదించి.. ఇంకా వీలైనంత త్వరగా 10 నిమిషాలలోపే అందుబాటులో ఉండే పరిస్థితి రావాలని జగన్ ఆకాంక్షించారు. దిశ యాప్‌ కోసం, పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్నిరకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ కె మోషేన్‌ రాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP disha act

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు