హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీలో మరో మూడు రిజర్వాయర్లకు సీఎం శంకుస్థాపన... లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యం

Andhra Pradesh: ఏపీలో మరో మూడు రిజర్వాయర్లకు సీఎం శంకుస్థాపన... లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

రాయలసీమలో మరో లక్ష ఎకరాలకు సాగునీరందించే మూడు రిజర్వాయర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

రాయలసీమలో మరో లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మూడు రిజర్వాయర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి వర్చువల్ విధానం ద్వారా సీఎం జగన్ భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మాలగుండ్ల శంకరనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో తీవ్రకరవులో ఉండే రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యామ్ కు టీడీపీ ప్రభుత్వం రూ.810 కోట్లు మంజూరు చేసింది. ఐతే అప్పటి నుంచి పనులు ప్రారంభంకాలేదు. దీనిపై దృష్టిపెట్టిన సీఎం జగన్.. అప్పర్ పెన్నార్ మ్ కు కృష్ణా జలాలను అందించేలా ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.

రాయలసీమకు సాగునీరందించేందుకు ఖర్చుకు వెనకాడకుండా ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో నిర్మిస్తున్నామని.. వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Krishna River, Rayalaseema, Ys jagan

ఉత్తమ కథలు