ఏపీలో జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు.

news18-telugu
Updated: December 2, 2019, 12:44 PM IST
ఏపీలో జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
సీఎం జగన్
  • Share this:
ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ ఆరోగ్య భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్... ఆరోగ్యశ్రీ పథకంలో పలు మార్పులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేసుకున్న వారికి నెలకు రూ. 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా జనవరి ఒకటి నుంచి కొత్త ఆరోగ్య శ్రీకార్డులు ఇవ్వనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్ కొనుగోలు చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 15 నాటికి 510 రకాల మందులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రెండు వేల రోగాలకు ఆరోగ్యశ్రీని విస్తరిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ రోగులకు సైతం ఆరోగ్యశ్రీలోనూ చికిత్స అందిస్తామని ప్రకటించారు.






First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>