హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Floods 2022: ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

AP Floods 2022: ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

వరదలపై సీఎం జగన్ సమీక్ష

వరదలపై సీఎం జగన్ సమీక్ష

గోదావరి (Godavari River) మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నదీపరివాహక ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో గోదావరి వరదలపై ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు.

గోదావరి (Godavari River) మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నదీపరివాహక ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో గోదావరి వరదలపై ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. వరదలు, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో చర్చించిన సీఎం.. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులకు సీఎం స్పష్టంచేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని.., మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని స్పష్టంచేశారు.

వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికిన అన్నికుటుంబాలకు చేర్చాలన్న సీఎం.., ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలన్నారు. ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం.., ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఆదేశించారు.

ఇది చదవండి: చంద్రబాబు మా అన్నయ్య.. బంధుత్వంపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు


ఇదిలా ఉంటే గోదావరికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వరద మొత్తం 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ సంబంధిత అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

ఇది చదవండి: వందేళ్ల రికార్డులు తిరగరాస్తున్న జగన్.. యువతకు ట్రైనింగ్ తో పాటు ఉద్యోగాలు కూడా..!


అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలు, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి లో 4 మండలాలు, ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉంది. వరద సహాయక చర్యలపై అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందుతున్నాయి.

వరద సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. మరో 177 గ్రామలను వరదలు ముంచెత్తే అవకాశముంది. ఇప్పటివరకు 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టుల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Floods, Godavari river

ఉత్తమ కథలు