ఇసుక అక్రమ రవాణాకు చెక్... ఈ నెంబర్‌కు కాల్ చేయండి

అవినీతిపై ఫిర్యాదులకు 14400 కాల్ సెంటర్

ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబరును సీఎం జగన్ ప్రారంభించారు.

  • Share this:
    ఏపీలో ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇసుక ధరలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చర్చలు తీసుకున్న ప్రభుత్వం... ఇందులో భాగంగా మరో ముందడుగు వేసింది. ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబరును సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్‌ సెంటర్‌ ఉద్యోగులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్‌, టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ సురేంద్ర బాబు తదితరులు హాజరయ్యారు.

    ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే... 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా రూ. 2 లక్షల వరకు జరిమానా విధించేలా మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఇసుక కొరతను సాధ్యమైనంత తొందరగా అధిగమించాలనే భావనలో ఉన్న ఏపీ ప్రభుత్వం... ఇందుకోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: