Independence Day Speech : ఏపీ సీఎం జగన్ ప్రసంగంలో కీలక అంశాలు ఇవీ

వైఎస్ జగన్

73rd Independence Day : విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు.

  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి వైసీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం హోదాలో మొదటిసారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న జగన్... స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. జెండా ఆవిష్కరణ తర్వాత జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు వైఎస్ విజయమ్మ, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, కొందరు మంత్రులు, డీజీపీ సవాంగ్ హాజరయ్యారు.సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో కీలక అంశాలు :
- మహాత్మాగాంధీ గ్రామస్వరాజ్యం, అంబేద్కర్ ఆలోచనా విధానం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారి ప్రేరణతోనే నవరత్నాలు రూపొందించాను.
- సమాజంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా ఉన్నాయి. కులాలు, మతాల పరంగా ఇప్పటికీ అన్యాయం జరుగుతోంది.
- రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్య్రం పొందలేకపోతున్నవారి కోసం నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో చట్టాలు చేశాం.
- గ్రామాలను మార్చేందుకు గ్రామ సచివాలయంలు పెడుతున్నాం.
- మద్యాన్ని తగ్గించే, మాన్పించే విధానాన్ని అమలు చేస్తున్నాం.
- రైతులకూ, పేదలకూ ఉచితంగా కరెంట్ ఇవ్వాలంటే ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ సంస్థల్ని ఆడిగాం. ఇలా అడిగినందుకు హాహాకారాలు, టెండర్ ధర తగ్గించండి అన్నందుకు గగ్గోలు చేస్తున్నారు.
- పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇద్దాం అంటే నానా యాగీ చేస్తున్నారు.
- మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలు తీసుకొచ్చాం.
- శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్న మొదటి రాష్టం ఏపీ.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏపీ.
- టెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం.
- రైతులకు పగటిపూట 9 గంటల కరెంట్ ప్రస్తుతం 60 శాతం ఇస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు 7 లక్షల పరిహారం అందిస్తున్నాం.
- రైతు భరోసా పధకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికీ రూ.12 వేల 500 అందిస్తున్నాం.
- గోదావరి జలాలు శ్రీశైలంకు తరలించడం ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలలకు తాగు, సాగు నీరు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం.
- గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన నష్టాలను పూడ్చేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం.

రాఖీ పూర్ణిమ సందర్భంగా... రాష్ట్ర ప్రజలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో రక్షా బంధన్ జరుపుకోవాలని కోరారు.

Greetings to all on the auspicious occasion of #RakshaBandhan, which signifies the bond of love, protection and respect of siblings for each other. Wishing you all a joyous and a fun-filled Rakhi.


— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2019

First published: