Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN GIVES KEY INSTRUCTIONS TO OFFICIALS ON NEW DISTRICTS IN THE STATE FULL DETAILS HERE PRN GNT

Jagan on New Districts: కొత్త జిల్లాలపై సీఎం జగన్ క్లారిటీ.. అధికారులకు కీలక ఆదేశాలు..

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts) పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ (AP CM YS Jagan) ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts) పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ (AP CM YS Jagan) ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఏప్రిల్‌ 4 ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు కాగా.., సీఎం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలని.., కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు.

    కార్యాలయాలన్నీ ఒకేచోట..
    కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపికచేసుకోవాలని.., పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

    ఇది చదవండి: ఒక్కరోజులో రూ.50 లక్షలు ఖర్చు చేయాలి.. లేదంటే అంతా వేస్ట్.. ఇది సినిమా కాదు రియల్..


    అంతకుముందు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎస్‌ సహా, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజలనుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని అధికారులు అన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేసినట్లు తెలిపారు. సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామన్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారు చేసినట్లు వెల్లడించారు.

    ఇది చదవండి: 40ఏళ్ల టీడీపీ.. ఇకనైనా వ్యూహం మారుస్తుందా..? అన్నగారి పేరు నిలబెడుతుందా..?


    కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక చెక్‌లిస్టు కూడా తయారు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కొత్త జిల్లాలకు సంబంధించి నూతన వెబ్‌ సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తైనట్లు తెలిపారు. అలాగే కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ కూడా తయారు చేసినట్టు వెల్లడించారు.

    ఇది చదవండి: ఏపీలోని ఆ పథకంపై ఆసక్తి చూపని జనం.. ఏడాదికి రూ.60వేలు ఇస్తామన్నా నో రెస్పాన్స్..!


    కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలకు సంబంధించిన వివరాలను కూడా అందించారు. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP new districts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు