హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో ఆర్టీసీ బస్సులపై సీఎం జగన్ క్లారిటీ.. ఎప్పటి నుంచంటే.

ఏపీలో ఆర్టీసీ బస్సులపై సీఎం జగన్ క్లారిటీ.. ఎప్పటి నుంచంటే.

8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు.

మే 31 వరకు రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ర్యాలీలు, సభలు సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి ఉండబోదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

  ఏపీలో ప్రజా రవాణాపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో ప్రజా రవాణాను ప్రారంభిస్తామని తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడారు. లాక్‌డౌన్ 4 నేపథ్యంలో ఏపీలో ఇవ్వాల్సిన సడలింపులపై వారితో చర్చించారు. మే 31 వరకు రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ర్యాలీలు, సభలు సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. ఐతే ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్ సర్వీసులు, ప్రైవేట్ వాహనాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

  కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో మరో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2339కి చేరింది. వీరిలో తాజాగా 69 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా ఇప్పటివరకూ 1596 మంది కోలుకున్నట్లయ్యింది. అలాగే... మరో ఇద్దరు చనిపోవడంతో... మృతుల సంఖ్య 52కి చేరింది. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్న వారి సంఖ్య 691గా ఉంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: AP News, Apsrtc, Lockdown, Rtc, Ys jagan

  ఉత్తమ కథలు