హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Districts: కొత్త జిల్లాలపై సీఎం జగన్ ఫోకస్.. ఆ డిమాండ్లకు పరిష్కారం చూపిస్తారా..?

AP New Districts: కొత్త జిల్లాలపై సీఎం జగన్ ఫోకస్.. ఆ డిమాండ్లకు పరిష్కారం చూపిస్తారా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts) పై సీఎం జగన్ (AP CM YS Jagan) దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts) పై సీఎం జగన్ (AP CM YS Jagan) దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. అలాగే జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాలు,హద్దులు, రెవెన్యూ డివిజన్ల మార్పు, స్థానికంగా వస్తున్న డిమాండ్లు, ఒత్తిడుల వంటి అంశాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వాటిపైనా చర్చించారు. అభ్యంతరాలపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతుల్లో వేటిని పరిష్కరించేందుకు వీలుంది.. ఎవి సాధ్యం కాదు అనే దానిపై సీఎం చర్చించినట్లు సమాచారం. అలాగే అధికారులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

  రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. ఈ నెల 29న కొత్త జిల్లాల తుదిరూపు ఖరారు చేసే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 31న తుది నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఐతే తుది నోటిఫికేషన్ ఇచ్చేలోపు మరోసారి కొత్త జిల్లాలపై సీఎం చర్చించే అవకాశముంది. ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచే పాలన జరగనుంది. ఇప్పటికే కొత్త జిల్లాలపై కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర ఆఫీసుల కోసం భవనాల ఎంపికను కూడా పూర్తి చేసింది.

  ఇది చదవండి: వంద నోటుపై నేతాజీ బొమ్మ.. మరో ఉద్యమానికి పవన్ పిలువు..!

  ఇదిలా ఉంటే కొత్త జిల్లాలపై మొత్తం 11వేల అభ్యంతాలు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేసిన విభజనపై చాలా చోట్ల అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండటం, జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల పరిధి, అవసరం వంటి అంశాలతో పాటు అప్పటికే ఉన్న జిల్లాల డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. జిల్లాల విషయంలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై స్థానికంగా తీవ్ర ఒత్తిడి వస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలుగా ఉండి జిల్లా కేంద్రాలను కోల్పోయిన చోట నిరసనలు కూడా ఎక్కువయ్యాయి.

  ఇది చదవండి: ఏపీలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులు ఇలా.. సర్వీస్, సీనియారిటీ పరిస్థితేంటి..?

  హిందూపురం (శ్రీ సత్యసాయి), నరసాపురం, రాజంపేట (అన్నమయ్య) జిల్లాల కేంద్రాలు, తిరుపతి జిల్లా పరిధితో పాటు శ్రీబాలాజీ జిల్లా అనే పేరు, విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు, నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరులో ఉంచడం, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడం, రంపచోడవరం, మదనపల్లి కొత్త జిల్లాల డిమాండ్లు, కర్నూలు సమీపంలోని మండలాను నంద్యాలలో కలపడం వంటి వాటిపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. మరో నాలుగు రోజుల్లో తుదినోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP new districts

  ఉత్తమ కథలు