హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan on Budget: బడ్జెట్ విషయంలో జగన్ వైఖరేంటి..? ఆ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారా..?

YS Jagan on Budget: బడ్జెట్ విషయంలో జగన్ వైఖరేంటి..? ఆ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారా..?

ఏపీకి సంబంధించి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశం (Special Status), పోలవరం ప్రాజెక్ట్ నిధులు (Polavaram Project) వంటి అంశాల ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్ (Union Budget) లో లేకపోవడం బాధాకరం.

ఏపీకి సంబంధించి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశం (Special Status), పోలవరం ప్రాజెక్ట్ నిధులు (Polavaram Project) వంటి అంశాల ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్ (Union Budget) లో లేకపోవడం బాధాకరం.

ఏపీకి సంబంధించి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశం (Special Status), పోలవరం ప్రాజెక్ట్ నిధులు (Polavaram Project) వంటి అంశాల ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్ (Union Budget) లో లేకపోవడం బాధాకరం.

  Anna Raghu, Guntur, News18

  గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్  (Union Budget-2022) ప్రవేశపెట్టడానికి ముందు దేశవ్యాప్తంగా ప్రజలలో ఒకింత ఆసక్తి నెలకొనేది. ఏ రాష్ట్రానికి ఎంతిస్తారు.. ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్ పెంచుతారా..? వేటి ధరలు తగ్గుతాయ్.. ఏ ధరలు పెరుగుతాయనే ఆసక్తి ఉండేది. కానీ ఈ సారి మాత్రం బడ్జెట్ పై ప్రజల్లో ఆసక్తత కొరవడిందనే చెప్పాలి. బడ్జెట్ మొత్తంలో మధ్యతరగతికి ఏమీ ఒరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా బడ్జెట్ అనగానే "మంచం ఉన్నంతవరకే కాళ్ళు ముడుచుకోవాలి" అనే చందంగా ఆదాయవ్యయాల లెక్కలు, మిగులు నిధులు, సంక్షేమం, అభివృద్ధి పధకాలకు సంబంధించిన ప్రణాళికలు వంటి అంశాలు ప్రధానంగా భూమిక పోషిస్తాయి. ప్రభుత్వ రాబడి పెంచుకోవడానికి తీసుకోవలసిన చర్యలు, వచ్చిన రాబడికి తగ్గట్టు ఖర్ఛుల అంచనాలు తయారు చేయడం బడ్జెట్ ప్రధాన ఉద్ధేశ్యం.

  ఐతే తాజా బడ్జెట్ విషయంలో డిజిటల్ రంగానికి ఊతమివ్వడమే కొత్త అంశం తప్ప.. వేతన జీవులకు, పన్ను చెల్లింపుదారులకు కనీస ఊరటనివ్వలేదన్న విమర్శలు ఎదురవుతున్నాయి. లక్షల కోట్ల బడ్జెట్ తో ఏటా వడ్డీల రూపేణ 9.41లక్షల కోట్ల రూపాయలు ఖర్ఛు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులకు ఎరువులపై ఇచ్చే సబ్సీడీలలో కూడా కోతపెట్టారంటేనే బడ్జెట్ ఎంతటి నిరాశిజనకంగా ఉందో ఇట్టే అర్ధమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

  ఇది చదవండి: ఆ డిమాండ్లకు కాలం చెల్లింది.. పీఆర్సీ ఉద్యమంపై సజ్జల కీలక వ్యాఖ్యలు..


  ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికొస్తే బడ్జెట్ లో వామహస్తం విదిలింపులు కూడా లేవనే చెప్పాలి. బడ్జెట్ లో రాష్ట్ర అవసరాలపై ప్రధిని మోడీని కలిసి వినతిపత్రం సమర్పించి తరువాత సీఎం జగన్, ప్రీ బడ్డెట్ ప్రిపరేషన్ సమావేశాలు తర్వాత.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిసిన ఎంపీ విజయసా రెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చేసిన ప్రకటనలు కేంద్రం ఏపీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందనే అనే భావన కల్పించాయి. తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అదంతా భ్రమ అని తేలిపోయిందనే చెప్పాలి. ఏపీకి సంబంధించి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశం, పోలవరం ప్రాజెక్ట్ నిధులు, విశాఖ రైల్వేజోన్ వంటి అంశాల ప్రస్తావన కూడా లేకపోవడం బాధాకరం.

  ఇది చదవండి: చంద్రబాబుకు తప్పని తమ్ముళ్ల తలనొప్పి.. ఆ మంత్రి ఇలాకాలో తలోదారి.. కారణం ఇదేనా..!


  అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ పెద్దలతో సంధికి ప్రయత్నిస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బడ్జెట్ పై బహిరంగంగా నే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం కనీసం ఒక ప్రకటన కూడా చేయకపోవడంపై రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. బుగ్గన రాజెంద్రనాధ్ రెడ్డి మాత్రం బడ్జెట్ బావుందంటూనే దానిలోని లోటుపాటులను తెలియజేస్తూ తనదైన శైలిలో వేసిన వ్యంగ్యాస్త్రాలు ప్రభుత్వ నిర్వేదాన్ని తెలియజేస్తున్నాయి.

  ఇది చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్... సీఎం జగన్ కీలక ఆదేశాలు


  ఢిల్లీలో వైసీపీకి 28 మంది ఎంపీలున్నా లాభం లేదని.. రాష్ట్రానికి కేటాయింపు సాధించలేని సీఎం జగన్ రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంత జరిగినా కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని ఏమీ అనలేకపోతున్నారనేది ప్రతిపక్షాల వాదన. ఇప్పటికైనా కేంద్రం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరు మారకపోతే రానున్నరోజుల్లో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూఠగట్టుకోక తప్పదంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Budget 2022-23

  ఉత్తమ కథలు