హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

UPSC Civil Services result: సివిల్స్‌ విజేతలకు సీఎం జగన్‌ అభినందనలు

UPSC Civil Services result: సివిల్స్‌ విజేతలకు సీఎం జగన్‌ అభినందనలు

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

CM  Jagan congratulates civils winners: ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్‌ఎస్‌ (IFS)తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల ప్రిలిమ్స్ (Civil Services prelims)‌–2021 ఫలితాలు విడుదల అయ్యాయి

ఇంకా చదవండి ...

CM  Jagan congratulates civils winners: ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్‌ఎస్‌ (IFS)తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల ప్రిలిమ్స్ (Civil Services prelims)‌–2021 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో 685 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది. సివిల్స్‌లో శృతి శర్మ మొదటి ర్యాంక్, అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా.. మూడో ర్యాంక్ సాధించారు.

సివిల్స్ -2021లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ సారి ఫలితాల్లో యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించారు. పూసపాటి సాహిత్య 24, కొప్పి శెట్టి కిరణ్మ యి 56, శ్రీపూజ 62, గడ్డం సుధీర్ కుమార్రెడ్డి 69, ఆకునూరి నరేశ్ 117, అరుగుల స్నేహ 136, బి.చైతన్య రెడ్డి 161, ఎస్.కమలేశ్వ రరావు 297, విద్యా మరి శ్రీధర్ 336, దిబ్బడ ఎస్వీ అశోక్ 350, గుగులావత్ శరత్ నాయక్ 374, నల్లమోతు బాలకృష్ణ 420, ఉప్పు లూరి చైతన్య 470, మన్యా ల అనిరుధ్ 564, బిడ్డి అఖిల్ 566, రంజిత్ కుమార్ 574, పాండు విల్స న్ 602, బాణావత్ అరవింద్ 623, బచ్చు స్మరణ్రాజ్ 676 ర్యాం కులు సాధించారు.

సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్‌రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం జగన్‌ అభినందించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Ap cm jagan, Civil Services

ఉత్తమ కథలు